Begin typing your search above and press return to search.
మంచు తుఫానుతో మధ్య అమెరికా వణుకుతోంది
By: Tupaki Desk | 16 April 2018 6:03 AM GMTమనకిక్కడ ఎండలు మండుతున్న వేళ.. మధ్య అమెరికాలో పరిస్థితి మరోలా ఉంది. విపరీతంగా కురుస్తున్న మంచుకు మంచు తుఫాను తోడు కావటంతో మధ్య అమెరికా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. విపరీతంగా కురుస్తున్న మంచు.. చలిగాలులకు తాళలేక ప్రజలు నరకయాతన పడుతున్నారు.
వసంత రుతువు స్టార్టింగ్ వేళలో గల్ప్ తీరం నుంచి గ్రేట్ లేక్స్ ప్రాంతం వరకూ ఏర్పడిన తుఫాను కారణంగా మధ్య అమెరికా వాసులు కిందామీదా పడిపోతున్నారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో వందలాది విమానాలు రద్దు అయ్యాయి. రహదారుల నిండా మీటర్ల కొద్ది మంచు పేరుకుపోవటంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
మంచు తుఫానుల కారణంగా ఇప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడిన వార్తలు వస్తున్నాయి. పలు విమానాశ్రయాల రన్ వే మీద దట్టంగా మంచు కురవటంతో పలు విమానాల్ని క్యాన్సిల్ చేశారు. దక్షిణ డకోటాలో అతి పెద్ద నగరమైన సియాక్స్ ఫాల్స్ ఎయిర్ పోర్ట్ ను రెండో రోజు కూడా మూసేశారు. మిన్ని యాపోలిస్ లో శనివారం రాత్రి ఏకంగా 33 సెంటీమీటర్ల మంచు కురిసింది. దీంతో.. అక్కడ జరగాల్సిన బేస్ బాల్ గేమ్ ను రద్దు ఏశారు. లక్షలాది మంది ప్రజలకు చుక్కలు చూపిస్తోన్న మంచు తుఫాను మిన్నెసోటా..విస్కాన్సిన్.. మిచిగాన్ మీదుగా న్యూయార్క్.. న్యూ ఇంగ్లండ్ లను తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.