Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ 4 : క్రీడాకారులకు భారీ ఊరట ... కానీ!
By: Tupaki Desk | 18 May 2020 10:30 AM GMTదేశంలో మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ ను మరోసారి పొడిగించారు. ఇప్పటికే ఇచ్చిన సడలింపులకు అదనంగా కొన్ని జోడించి.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను మే 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంలో కొత్త మార్గదర్శకాలను సైతం విడుదల చేశారు. నాలుగో దశ లాక్ డౌన్ నుండి ఇచ్చిన సడలింపుల వల్ల క్రీడాకారులకు ఊరట లభించనుంది. గత రెండు నెలలుగా ఇంటికే పరిమితమై ఫిట్ నెస్ కోసం నానా తంటాలు పడుతున్న ఆటగాళ్లు.. ఇక నుంచి ఏం చక్కా మైదానాల్లో శిక్షణను ప్రారంభించవచ్చు. లాక్ డౌన్ 4.0లో స్టేడియాలు, క్రీడా సముదాయాలు తెరుచుకోవచ్చని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది.
అయితే మైదానాలు, స్టేడియాల వద్ద ఏ ఒక్క ప్రేక్షకుణ్ని అనుమతించరాదని కేంద్రం స్పష్టం చేసింది. దీనితో టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన భారత క్రీడాకారులకు ఇది కచ్చితంగా పెద్ద ఊరట. తాజా వెసులుబాటుతో ఇకపై భారత స్పోర్ట్స్ అథారిటీ కేంద్రాల్లో శిక్షణా శిబిరాలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటించాలని హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
అయితే పూర్తిగా లేదా కొద్దిమేర కాంటాక్టు కలిగివుండే ఆటలకు సంబంధించి శిక్షణ ప్రారంభానికి ప్రభుత్వంనుంచి మరిన్ని మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ‘క్రీడా సముదాయాలా లేక శిక్షణ కేంద్రాలను మాత్రమే తెరవాలా.. అన్నదానిపై మాకు స్పష్టత రావాల్సి ఉంది. సాయ్ కేంద్రాల్లోకి సాధారణ ప్రజలకు ఎలాగూ ప్రవేశముండదు. కానీ ప్రతి క్రీడ భిన్నమైనది. అందువల్ల పూర్తి వివరాల కోసం మరో రోజు వేచి చూస్తాం అని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరీందర్ బాత్రా అన్నారు