Begin typing your search above and press return to search.

డీ గ్యాంగ్‌..చోటా ష‌కీల్‌...ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్ట్‌

By:  Tupaki Desk   |   14 Dec 2017 4:18 AM GMT
డీ గ్యాంగ్‌..చోటా ష‌కీల్‌...ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్ట్‌
X
మాఫియాడాన్‌ - ముంబయి బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు దావూద్‌ ఇబ్రహీం విష‌యంలో సంచ‌ల‌న వార్త‌ను కేంద్ర ఇంటెలిజెన్స్ బ‌య‌ట‌పెట్టింది. దావూద్‌ కుడిభుజం అయిన ఛోటా షకీల్‌ డీ కంపెనీకి సీఈఓగా వ్యవహరించనున్నాడని గ‌తంలో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే డీ కంపెనీకి ష‌కీల్ దూర‌మ‌య్యాడ‌ని ఇంటెలిజెన్స్ వెల్ల‌డించింది. మాఫియాడాన్‌ దావూద్ టీంలో చీలిక‌లు వ‌చ్చాయ‌ని..ష‌కీల్ త‌న‌దారి తాను చూసుకున్నాడ‌ని తెలిపింది.

2015లో త‌న 60 ఏట పుట్టిన‌రోజు సంద‌ర్భంగా స‌న్యాసం తీసుకోవాల‌ని దావూద్ నిర్ణ‌యం తీసుకున్నాడు. ఈ క్ర‌మంలో దావూద్‌ నేర జీవితానికి స్వస్తి చెప్పి మక్కా వెళ్లాలనుకున్నట్టు వార్త‌లు వ‌చ్చాయి. అదే స‌మ‌యంలో ఇక మీదట డీ కంపెనీ వ్యవహారాలు దావూద్‌ సోదరుడు అనీస్‌ అహమ్మద్‌ చూస్తారని స‌మాచారం వెలువ‌డింది. ఈ బాధ్య‌త‌ల కార‌ణంగానే ష‌కీల్‌ హ‌ర్ట‌య్యార‌ట‌. డీ గ్యాంగ్ బాధ్య‌త‌లు అన్నీ త‌న‌కు వ‌చ్చేస్తాయ‌నుకుంటే...దావూద్ సోద‌రుడు ఎంట్రీ ఇవ్వ‌డంతో ఆయ‌న తట్టుకోలేక‌పోయాడ‌ని తెలుస్తోంది.

దీంతో ఇటీవ‌లే కరాచిలోని దావూద్ ఇబ్రహీంకు చెందిన క్లిఫ్టన్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన చోటా షకీల్ రహస్య ప్రాంతంలో తలదాచుకున్నాడని ఇంటలిజెన్స్ వర్గాలు అంటున్నాయి. అయితే ఆయ‌న ఆషామాషీగా ఏమీ బ‌య‌ట‌కు వెళ్ల‌లేద‌ని - మ‌రో నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడ‌ని ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు చెప్తున్నాయి.

ఇదిలాఉండ‌గా...కొద్దికాలం క్రితం దావూద్‌ కు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన వార్త వెలుగులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం మాత్రం త‌న కొడుకులు త‌న ప‌రువుతీస్తున్నార‌ని వాపోతున్నార‌ని తేలింది. డీ గ్యాంగ్‌ కు సంబంధించిన ఇక్బాల్ ను విచారిస్తున్న సంద‌ర్భంగా ముంభై పోలీసులు ఈ విష‌యాన్ని తెలుసుకున్నారు. డాన్ అవుతాడనుకున్న కొడుకు ఇప్పుడు ఓ ముస్లిం మత పెద్దగా మారాడు. అది చూసి కుళ్లికుళ్లి ఏడుస్తున్నాడట దావూద్. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తన అండర్ వరల్డ్‌ ను చూసుకునేది ఎవరంటూ దావూద్ ఎప్పుడూ ఫీలవుతుంటాడని, ఇదే అతన్ని కుంగిపోయేలా చేసిందని ఇక్బాల్ విచారణలో భాగంగా వెల్లడించాడు. దీనికితోడు అతని పెద్ద తమ్ముడు అనీస్ ఇబ్రహీం కూడా వయసు మీద పడటంతో వ్యాపారాన్ని చూసుకోలేకపోతున్నాడు. ఇతర తమ్ముళ్ల పరిస్థితీ ఇలాగే ఉందని ఇది దావూద్ ఆవేద‌న‌కు కార‌ణంగా మారింద‌ని పేర్కొన్నారు.