Begin typing your search above and press return to search.

లోక్ జన శక్తిలో చీలిక..బీజేపీ పనేనా ?

By:  Tupaki Desk   |   15 Jun 2021 4:30 AM GMT
లోక్ జన శక్తిలో చీలిక..బీజేపీ పనేనా ?
X
బీహార్లో లోక్ జన శక్తి పార్టీ చీలిపోయింది. అంతర్గత కలహాల వల్లే పార్టీలో చీలక వచ్చిందనే విషయం కనబడుతున్నా తెరవెనుక మాత్రం బీజేపీ ప్రోద్బలంతోనే చీలిక జరిగిందనే ప్రచారం పెరిగిపోతోంది. ఎందుకంటే తన మైనర్ మిత్రపక్షాలను ఏదోపద్దతిలో చీలిక తేవటం కమలంపార్టీకి మామూలే అని చరిత్ర చెబుతోంది. అరుణాచల్ ప్రదేశ్ లో మిత్రపక్షమైన జనతాదళ్ పార్టీని ఇలాగే చీల్చి మెజారిటి వర్గాన్ని తనలో బీజేపీ కలిపేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇంతకీ విషయం ఏమిటంటే మొన్నటి బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలోని బీజేపీ+జనలతాదళ్ ను కాదని ఎల్జేపీ బయటకు వచ్చేసింది. జనతాదళ్ అధినేత నితీష్ కుమార్ ను టార్గెట్ చేస్తు ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ అన్నీ చోట్లా అభ్యర్ధులను పోటీ పెట్టారు. కూటమిలోని జనతాదళ్ కు వ్యతిరేకంగా బీజేపీకి అనుకూలంగా చిరాగ్ వ్యవహరించటాన్ని అప్పట్లోనే చిరాగ్ తండ్రి, పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడు పశుపతి కుమార్ పారస్ తప్పుపట్టారు.

అప్పటి ఎన్నికల్లో ఎల్జేపీ అభ్యర్ధులు ఒక్కచోట మాత్రమే గెలిచారు. దాంతో పార్టీలో చిరాగ్ వ్యవహారశైలిపై ఆరోపణలు మొదలయ్యాయి. చిరాగ్ వ్యవహారశైలి వెనక బీజేపీ వ్యూహం ఉందనే ఆరోపణలు కూడా పెరిగిపోయాయి. అప్పడు పార్టీలో మొదలైన గొడవలు చివరకు తాజాగా చీలికికు దారితీసింది. పార్టీకున్న ఆరుమంది ఎంపిల్లో ఐదుగురు చీలికవర్గంలోకి వెళ్ళిపోయారు. అలాగే చీలికవర్గానికి పశుపతి అధ్యక్షుడైపోయారు.

విచిత్రమేమిటంటే చీలిక విషయాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు రాతమూలకంగా చెప్పటం లోక్ సభ సెక్రటేరియట్ వర్గాలు గుర్తించటం కూడా అయిపోయిందట. అంటే అంత ఫాస్టుగా ఎల్జేపీ చీలికను లోక్ సభ సెక్రటేరియట్ గుర్తించటంతోనే బీజేపీ పాత్రపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. రేపు నరేంద్రమోడి మంత్రివర్గాన్ని విస్తరిస్తే ఎల్జేపీ తరపున చిరాగ్ స్ధానంలో పశుపతే కేంద్రమంత్రి అవుతారని కూడా అంటున్నారు. మొత్తానికి బీహార్ రాజకీయం మరోసారి ఆసక్తిగా మారుతోంది.