Begin typing your search above and press return to search.

జ‌ర్న‌లిస్టుల వైపు ఉమ్మేసి..సారీ చెప్పిన సీఎం అభ్య‌ర్థి

By:  Tupaki Desk   |   11 April 2017 4:29 PM GMT
జ‌ర్న‌లిస్టుల వైపు ఉమ్మేసి..సారీ చెప్పిన సీఎం అభ్య‌ర్థి
X
డీఎండీకే అధినేత‌ - త‌మిళనాడు ఫిల్మ్ స్టార్ విజ‌య్‌ కాంత్ త‌న వివాదాస్ప‌ద ప్ర‌వ‌ర్త‌న‌పై క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. రిపోర్ట‌ర్లతో అనుచితంగా ప్ర‌వ‌ర్తించిన ఘ‌ట‌న ప‌ట్ల క్ష‌మాప‌ణ చెబుతున్న‌ట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు తెలిపారు. విజ‌య్‌ కాంత్ త‌ర‌పున న్యాయ‌వాది జీఎస్ మ‌ణి ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

డిసెంబ‌ర్ 2015లో విజ‌య్‌ కాంత్ విలేక‌రులకు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. అక్క‌డ రిపోర్ట‌ర్లు అడిగిన కొన్ని ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న చికాకుకు లోన‌య్యాడు. కోపంతో అత‌ను రిపోర్ట‌ర్ల దిశ‌గా ఉమ్మేశాడు. అయితే ఆ ఘ‌ట‌న ప‌ట్ల క్ష‌మాప‌ణ చెబుతున్న‌ట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా క‌మిటీకి విజ‌య్‌ కాంత్ త‌ర‌పున ఆయ‌న లాయ‌ర్ వివ‌ర‌ణ ఇచ్చారు. త‌న ప్ర‌క‌ట‌న‌ను రికార్డు చేసిన పీసీఐ ఆ కేసును కొట్టిపారేసిన‌ట్లు విజ‌య్‌కాంత్ లాయ‌ర్ తెలిపారు. 2011-2016 మ‌ధ్య విజ‌య్‌ కాంత్ త‌మిళ‌నాడు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్నారు.

ఇదిలాఉండ‌గా..ప్రముఖ సినీ నటి రాధికకు చెందిన ఆఫీసులో ఐటీ శాఖ సోదాలు చేపట్టింది. టీ నగర్‌ లోని రాధికకు చెందిన రాడాన్ కార్యాలయంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తమిళనాడు ఆర్కే నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణల్లో..ఐటీ శాఖ ఇప్పటికే రాధిక భర్త శరత్‌ కుమార్ ఇంటిపై దాడులు చేసిన విషయం తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/