Begin typing your search above and press return to search.
గాడిద పేడతో గరంమసాలాలు !
By: Tupaki Desk | 18 Dec 2020 12:30 AM GMTప్రస్తుతం మార్కెట్స్ లో రకరకాలైన బ్రాండ్స్ మసాలాలు మనకి దొరుకుతున్నాయి. అయితే , వాటితో పాటుగా స్థానిక బ్రాండ్స్ అంటూ కొన్ని మసాలాలకి మంచి గిరాకీ ఉంటుంది. అయితే ,స్థానిక బ్రాండ్ల పేరుతో కల్తీ చేసిన మసాలాలను అమ్ముతున్నారనే ఆరోపణలు రావడంతో ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌లోని ఓ ఫ్యాక్టరీపై స్థానిక పోలీసులు దాడులు నిర్వహించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ తయారు చేసే మసాలాల్లో గాడిద పెంట ,ఎండు గడ్డి తినలేని రంగులు, యాసిడ్ కలుపుతున్నారట.
ఈ వ్యవహారం పై పూర్తి వివరాల్లోకి వెళ్తే...ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో అనూప్ వర్ష్ నే అనే వ్యక్తి ఎలాంటి లైసెన్స్ లేకుండా మసాలాలు, పొడులను తయారు చేసి అమ్మే వ్యాపారం చేస్తున్నాడు. అందుకు గాను అతను అక్కడ ఓ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాడు. అయితే ఆ మసాలాల్లో కల్తీ జరుగుతుందని విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు ఫ్యాక్టరీపై దాడులు చేశారు. ఆ దాడుల్లో పోలీసులకు దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. సాధారణ మసాలా వాడకం పెరిగిపోయిన నేపథ్యంలో నకిలీ మసాలాలు తయారై చివరికి ప్రాణం మీదికి తెచ్చిన ఘటనలు కూడా ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నకిలీ మసాలా తయారు చేస్తున్న ముఠాను గుర్తించి పోలీసులు అరెస్టు చేస్తూ ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ లోని నవీపూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్ని స్థానిక బ్రాండ్ల పేరుతో ఉన్న 300 కిలోల నకిలీ మసాలాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అంతేకాదు అక్కడ బయటపడిన వస్తువులు చూసి ఒక్కసారిగా షాకయ్యారు గాడిద పేడ, ఎండు గడ్డి తినలేని రంగులు యాసిడ్ సహ తదితర వస్తువులను కూడా సీజ్ చేశారు పోలీసులు. వీటితో కారం గరం మసాలా పసుపు లాంటివి తయారు చేస్తున్నట్లు గుర్తించారు.