Begin typing your search above and press return to search.

ప్రయాణికులకు నరకం చూపించిన స్పైస్ జెట్ ఫ్లైట్ జర్నీ

By:  Tupaki Desk   |   3 May 2022 3:29 AM GMT
ప్రయాణికులకు నరకం చూపించిన స్పైస్ జెట్ ఫ్లైట్ జర్నీ
X
విమాన ప్రయాణికులకు షాకిచ్చే వీడియో ఒకటి వైరల్ గా మారింది. ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ కు చెందిన బోయింగ్ బి737 విమానంలో ప్రయాణించిన ప్రయాణికులకు నరకం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూడటంతో పాటు.. ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొన్న వైనం షాకిచ్చేలా మారింది.

ఆదివారం సాయంత్రం ముంబయి నుంచి పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ కు వెళుతున్న విమానం.. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో గాల్లో భారీ కుదుపులకు లోనైంది.

కొన్ని సందర్భాల్లో వాతావరణం సరిగా లేనప్పుడు విమానం కుదుపులకు గురి కావటం.. ప్రయాణికులు ఆందోళనకు గురి కావటం తెలిసిందే. అయితే.. తాజా ఉదంతం మాత్రం అందుకు భిన్నమైనది.

మూడు సార్లు చోటు చేసుకున్న భారీ కదుపులకు విమానంలోని సామాన్లు కిందకు పడటం.. ఈ క్రమంలో పలువురు ప్రయాణికులకు గాయాలు కావటం జరిగింది. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామంతో ప్రయాణికులు భయాందోళనకు గురి కావటమే కాదు.. ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని విమానం ల్యాండింగ్ అయ్యేంతవరకు ఎదురుచూశారు.

సేఫ్ గా ల్యాండ్ అయిన తర్వాత ఊపిరి పీల్చుకున్న ప్రయాణికుల్లో దాదాపు 12 మంది ప్రయాణికులకు.. ముగ్గురు విమాన సిబ్బందికి గాయాలయ్యాయి. కొందరికి తలపై కుట్లు పడితే.. మరికొందరికి వెన్నుపూసతో పాటు మరిన్ని శరీర భాగాలపై గాయాలయ్యాయి.

విమానం ల్యాండ్ అవుతున్న వేళలో మూడు కుదుపులు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు. ఈ కుదుపుల తీవ్రత కారు ప్రమాదానికి గురైతే ఎదురయ్యే ప్రభావం కంటే ఎక్కువగా ఉందన్న మాటను చెప్పారు. కుదుపుల కారణంగా విమానం లోపల ఎలాంటి పరిస్థితి ఉందన్న విషయాన్ని కళ్లకు కట్టేలా వైరల్ వీడియో ఉందని చెప్పాలి.