Begin typing your search above and press return to search.

రాజ‌కీయాల‌కు బాల‌య్య గుడ్ బై చెప్పేస్తార!?

By:  Tupaki Desk   |   10 May 2017 3:51 PM GMT
రాజ‌కీయాల‌కు బాల‌య్య గుడ్ బై చెప్పేస్తార!?
X
నంద‌మూరి నటసింహం, అనంత‌పురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాలకృష్ణపై కొత్త చ‌ర్చ మొద‌లైంది. రాజకీయాలకి గుడ్ బై చెప్పేందుకు బాల‌య్య బాబు సిద్ధ‌మ‌య్యార‌ట‌. ఎమ్మ‌ల్యేగా త‌న ప్ర‌స్తుత ప‌ద‌వీకాలం ముగిసిన అనంత‌రం బాల‌య్య బాబు రాజకీయాల‌కు గుడ్‌బై చెప్తార‌ట‌. సొంత నియోజ‌క‌వ‌ర్గం హిందూపురంలో జ‌రుగుతున్న ప‌రిణామాలే ఇందుకు కార‌ణ‌మ‌ట‌. ఇంత‌కీ ఈ విశ్లేష‌ణ చేస్తున్న‌ది ఎవ‌రు అనేక‌దా మీ సందేహం. సోష‌ల్ మీడియా! అవునా..సోష‌ల్ మీడియా అంటే అయ్యే ప‌ని కాద‌ని కొట్టిపారేయ‌కండి. స‌రైన కార‌ణాలు కూడా ఈ ఫిఫ్త్ ఎస్టేట్ ప్ర‌తినిధులు చెప్తున్నారు.

బాల‌య్య ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో ముందుగా విప‌క్షాల ఆ త‌ర్వాత‌ ప్రజలు ఇటీవ‌లి కాలంలో వ‌రుస‌గా త‌మ నిర‌స‌న‌ల‌ను తెలుపుతున్న సంగతి తెలిసిందే. మొద‌ట‌ బాలయ్య కనిపించడం లేదంటూ గాడిదలతో ఊరేగింపులు చేశారు. ఈ ప‌రిణామం అందరినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ఇంత‌కంటే ఆశ్చ‌ర్యం ఏమిటంటే...దీనిపై బాలయ్య రియాక్ట్ కాలేదు. మ‌రో ముందుడుగు వేసి బాలయ్య కనిపించట్లేదంటూ పోలీస్ స్టేష‌న్‌ లో ఫిర్యాదు చేశారు. అయితే దీనికి కూడా బాల‌య్య స్పందించ‌లేదు. దీంతో కొత్త చ‌ర్చ మొద‌లైంది. రాజకీయాలకి బాలయ్య గుడ్ బై చెబుతున్నాడనే చ‌ర్చ‌కు తెరలేసింది. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ గా మారింది. సోషల్ మీడియాలో ప్రచారాలు ఊపందుకుంటున్నప్ప‌టికీ రాజకీయ సన్యాసం గురించి బాల‌య్య త‌ర‌ఫున ఎలాంటి స్పంద‌న రావడం లేదు. ఇంత‌కీ బాల‌య్య రాజ‌కీయ స‌న్యాసం చేయ‌నున్నారా?సినిమాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతారా అనే సందేహానికి బాల‌య్య మాత్ర‌మే స‌మాధానం ఇవ్వ‌గల‌రేమో!