Begin typing your search above and press return to search.

క‌రోనా టీకా..వ‌చ్చే చాన్సే లేద‌ట‌!

By:  Tupaki Desk   |   23 May 2020 5:01 PM GMT
క‌రోనా టీకా..వ‌చ్చే చాన్సే లేద‌ట‌!
X
కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 53 లక్షల ఒక వేయి 167 మంది ఈ మ‌హ‌మ్మారి బారిన పడ్డారు. ఈ వ్యాధి కార‌ణంగా - అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. యూఎస్‌ ఏలో ఇప్పటివరకు 97,647 మంది చనిపోయారు. ఇప్పుడు అంద‌రి చూపు క‌రోనా వ్యాక్సిన్‌ పైనే ఉంది. లండన్‌లో ఆక్స్‌‌ ఫర్డ్‌‌ యూనివర్సిటీ వ్యాక్సిన్‌‌ ట్రయల్స్‌‌ స్పీడు పెరుగుతోంది. ఇప్పటికే తొలిదశలో 1,000 మందిపై ప్రయోగం చేసిన వర్సిటీ ఇప్పుడు రెండో దశలో 10,260 మందిపై టెస్టు చేయబోతోంది. త్వరలోనే ప్రయోగం స్టార్టవుతుందని వర్సిటీ వెల్లడించింది. ఇలాంటి త‌రుణంలో అమెరికాకు చెందిన పేరెన్నిక‌గ‌న్న ఓ శాస్త్రవేత్త సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు.

క్యాన్స‌ర్‌ - హెచ్ ఐవీ/ఎ‌యిడ్స్‌ - హ్యూమ‌న్ జినోమ్ అంశాల్లో సుప్ర‌సిద్ధ ప‌రిశోధ‌న‌లు చేసిన‌ అమెరికాకు చెందిన శాస్త్రవేత్త విలియం హ‌సెల్టైన్ మాత్రం వెన్నులో వ‌ణుకుపుట్టే కామెంట్ చేశారు. త్వ‌ర‌లోనే కోవిడ్‌-19 వ్యాక్సిన్ వ‌స్తుంద‌నే విష‌యాన్ని ఖ‌చ్చితంగా చెప్ప‌లేమ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప‌రిశోధ‌న‌ల ద‌శ‌లో ఉన్న వ్యాక్సిన్లు ఎంత‌మేర‌కు ఫలితాన్ని అందిస్తాయ‌నే విష‌యం అనుమానాస్ప‌ద‌మ‌ని విలియం తెలిపారు. వివిధ దేశాలు లాక్ డౌన్ స‌డ‌లించ‌డం ప‌ట్ల‌ ఆయ‌న ఘాటుగా స్పందించారు.

లాక్ డౌన్ స‌డ‌లిస్తున్న దేశాలు వైర‌స్ వ్యాప్తి గురించి ఆలోచించాల‌ని అమెరికా దిగ్గ‌జ శాస్త్రవేత్త హెచ్చ‌రించారు. భౌతిక ధూరం - స‌రైన ప‌రిశుభ్ర‌త‌ - ఆరోగ్య ర‌క్ష‌ణ‌ప‌ర‌మైన అంశాలు పాటించుకుండా లాక్ డౌన్ ఎత్తివేస్తే...ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తి పెరిగిపోతుంద‌ని హెచ్చ‌రించారు. స‌రైన మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించిన చైనా - ద‌క్షిణ కొరియా - తైవాన్ ఈ విష‌యంలో విజ‌యం సాధించాయ‌ని తెలిపారు.

కాగా, ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ మాత్రం వ్యాక్సిన్‌పై ధీమాగా ఉంది. యూకేకు చెందిన బయోఫార్మాసూటికల్‌‌ కంపెనీ ఆస్ట్రజెనెకాతో కలిసి ఆక్స్‌‌ఫర్డ్‌‌ వర్సిటీ రీసెర్చ్‌‌ టీమ్‌‌ పని చేస్తోంది. కరోనాకు వ్యాక్సిన్‌‌ డెవలప్‌‌ చేసి పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ప్లాన్‌‌ చేస్తోంది. 40 కోట్ల డోసుల ఉత్పత్తికి ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికాకు చెందిన బయోమెడికల్‌‌ అడ్వాన్స్డ్‌‌ రీసెర్చ్‌‌ అండ్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ అథారిటీ నుంచి రూ. 7,500 కోట్లను ఆస్ట్రజెనెకా ఫండ్‌‌గా పొందింది. తొలి దశలో కొంత రేంజ్‌‌ వరకు ట్రయల్స్‌‌ జరిగాయని, పూర్తిగా సక్సెస్‌‌ అయ్యామని పేర్కొంది. ఇప్పుడు పరిధిని పెంచుతున్నామని.. ఈ దశలో చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అన్ని వయసుల వాళ్లపై ప్రయోగం చేస్తామంది. మూడో ఫేజ్‌ లో 18 ఏళ్ల‌ వాళ్లపై వ్యాక్సిన్‌‌ ఎంతలా ప్రభావం చూపిందో విశ్లేష‌ణ‌ చేస్తామని చెప్పింది.