Begin typing your search above and press return to search.

ఏయ్.. ఎవ‌రు నాదెండ్ల జంప్ అవుతున్నార‌న్న‌ది?

By:  Tupaki Desk   |   9 Jun 2019 12:23 PM GMT
ఏయ్.. ఎవ‌రు నాదెండ్ల జంప్ అవుతున్నార‌న్న‌ది?
X
ఉమ్మ‌డి రాష్ట్రంలో ఆఖ‌రి స‌భాప‌తిగా వ్య‌వ‌హ‌రించి.. చ‌రిత్ర‌లో నిలిచిపోయిన నాదెండ్ల మ‌నోహ‌ర్ రాజ‌కీయ భ‌విష్య‌త్తు మీద ప‌లు వాద‌న‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన‌లో చేరిన ఆయ‌న‌.. పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు అత్యంత స‌న్నిహితంగా ఉంటున్నారు. తానెక్క‌డికి వెళ్లినా మ‌నోహ‌ర్ ను వెంట పెట్టుకెళ్లే ప‌వ‌న్.. ఆయ‌న‌కు తానిచ్చే ప్ర‌యారిటీ ఏమిట‌న్న‌ది చెప్ప‌క‌నే చెప్పేస్తున్నారు.

ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాజ‌యం త‌ర్వాత నాదెండ్ల పెద్ద‌గా క‌నిపిస్తున్న‌ది లేదు. దీంతో.. ఆయ‌న ప‌వ‌న్ ను వ‌దిలేసి పార్టీ నుంచి దూరం కానున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికి బ‌లం చేకూరేలా ఇటీవ‌ల జ‌రిగిన పార్టీ విస్తృత స్థాయి స‌మావేశానికి ఆయ‌న హాజ‌రు కాక‌పోవ‌టంతో నాదెండ్ల పార్టీ మార‌తారా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

ఇదిలా ఉంటే.. ఈ రోజు ప‌వ‌న్ ను క‌లిశారు నాదెండ్ల మ‌నోహ‌ర్‌. ఇరువురు క‌లిసిన ఫోటోను విడుద‌ల చేయ‌టంతో పాటు.. నాదెండ్ల మ‌నోహ‌ర్ ఈ మ‌ధ్య‌న అమెరికాకు వెళ్లార‌ని.. ఈ కార‌ణంతోనే గుంటూరు జిల్లా స‌మీక్షా స‌మావేశానికి రాలేదు త‌ప్పించి.. మ‌రింకేమీ లేద‌న్నారు. కావాల‌నే నాదెండ్ల వెళ్లిపోతున్న‌ట్లుగా దుష్ప్ర‌చారం చేస్తున్నారే త‌ప్పించి. . ఆయ‌న ప‌వ‌న్ తోనే ఉంటార‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెనాలి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థిగా పోటీ చేసి.. ఓట‌మి పాల‌య్యారు.