Begin typing your search above and press return to search.

ఏపీలో యాత్రా స్పెష‌ల్‌.. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూడా న‌ట‌!!

By:  Tupaki Desk   |   1 March 2023 7:00 PM GMT
ఏపీలో యాత్రా స్పెష‌ల్‌.. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూడా న‌ట‌!!
X
ఏపీలో ఇప్ప‌టికే జ‌రుగుతున్న టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ పాద‌యాత్ర యువ‌గళం జోరుగా సాగుతున్న విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున జ‌నాలు ఈ యాత్ర‌లో పాల్గొంటూ.. లోకేష్‌కు సంఘీభావం తెలుపుతున్నారు. అయితే, త్వ‌ర‌లోనే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా వారాహి యా త్రను ప్రారంభించ‌నున్నారు. ఇది కూడా రాష్ట్ర వ్యాప్తంగా సాగనుంది. దీనికి ఇంకా ముహూర్తం అయితే నిర్ణ‌యించ‌లేదు.

ఈ రెండు యాత్ర‌ల‌పై కూడా అన్ని వ‌ర్గాలు దృష్టి పెట్టాయి. ముఖ్యంగా రాజ‌కీయ నేత‌లు ఎక్కువ‌గా ఈ యాత్ర‌ల‌ను ప‌రిశీలిస్తున్నారు.వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓట్ల‌ను చీల్చ‌కుండా చూస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఈ యాత్ర‌ల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఇదిలావుంటే.. మ‌రోవైపు.. రాష్ట్రంలో ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని యాత్రల‌ను ప్రారంభించేందుకు మ‌రో మూడు పార్టీలు కూడా స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి.

సీపీఐ పార్టీ ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు త్వ‌ర‌లోనే యాత్ర‌ను రెడీ చేస్తున్న‌ట్టు క‌మ్యూనిస్టులు ప్ర‌క‌టించారు. వైసీపీ ప్ర‌జావ్య‌తిరేక పాల‌న‌పై 'పోరుగ‌ళం' పేరుతో ఈ యాత్ర‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్టు కామ్రెడ్లు తెలిపారు. ఇచ్చాపురం నుంచి అనంత‌పురం వ‌ర‌కు ఈ యాత్ర సాగుతుంద‌ని పేర్కొన్నారు. ఈ యాత్ర‌లో ప్ర‌జ‌ల‌ను క‌లిసి వైసీపీ ప్ర‌భుత్వ ప్ర‌జాకంట‌క నిర్ణ‌యాల‌పై వారికి అవ‌గాహ‌న క‌ల్పిస్తామ‌ని చెబుతున్నారు.

ఇక‌, మ‌రోవైపు.. బీజేపీ ఏపీ విభాగం కూడా త్వ‌ర‌లోనే పాద‌యాత్ర చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. ఇప్ప‌టికే జిల్లాల్లో మండ‌లాల వారీగా నాయ‌కులు ప‌ర్య‌టిస్తున్నారు. అయితే, రాష్ట్ర‌స్థాయిలో పార్టీకి ఊపు తెచ్చేందు కు కీల‌క‌నేత‌లు..పాద‌యాత్ర చేయాల‌ని..కేంద్రం నుంచి ఆదేశాలు అందిన‌ట్టు పార్టీవ‌ర్గాలు చెబుతున్నా యి. అయితే.. అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల నేప‌థ్యంలో ఈ యాత్ర‌పై ఇప్ప‌టి వ‌ర‌కు నిర్ణ‌యం తీసుకోలేదు.

కాంగ్రెస్ కూడా పాద‌యాత్ర‌కు రెడీ అవుతోంది. చేయి చేయి కలుపుదాం! నినాదంతో పాద‌యాత్ర‌ల‌కు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ ఏపీ చీఫ్ గిడుగు రుద్ర‌రాజు నేతృత్వంలోనే ఈ యాత్ర సాగుతుంద‌ని తెలుస్తోంది.

మొత్తంగా రాష్ట్రంలో ఎండా కాలం కాస్తా..పాద‌యాత్ర‌ల కాలంగా మారిపోనుంద‌న్న‌ మాట‌. మ‌రో ఆరు మాసాల‌కు ఈయాత్ర‌ల జోరు పెర‌గ‌నుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌జ‌లు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.