Begin typing your search above and press return to search.
ప్రత్యేకహోదాకు కేంద్రమే లైఫిచ్చిందా ?
By: Tupaki Desk | 13 Feb 2022 7:30 AM GMTమరుగునపడిపోయిందని అనుకున్న ప్రత్యేకహోదా అంశానికి కేంద్రప్రభుత్వమే మళ్ళీ లైఫ్ ఇచ్చిందా ? అవుననే అనుకుంటున్నారు జనాలు. 2014 విభజన చట్టం ద్వారా ఏపీ ప్రయోజనాల కోసం అమలు చేయాల్సిన ప్రత్యేకహోదా అంశానికి నరేంద్రమోడి సర్కార్ సమాధి కట్టేసింది. విభజన జరిగిన ఏడున్నరేళ్ళయినా ఇంతవరకు హోదా దక్కలేదంటే ఇక ముందు కూడా దక్కదనే అందరికీ అర్ధమైపోయింది. నరేంద్రమోడికి ఏదన్నా రాజకీయ అనివార్యత ఏర్పడితే తప్ప ఏపీకి ప్రత్యేకహోదా దక్కేది కలేని అందరు అనుకున్నారు.
ఇలాంటి నేపధ్యంలో హఠాత్తుగా రాజ్యసభలో మోడి రాష్ట్ర విభజన, ఏపీకి అన్యాయం జరగటం లాంటి అంశాలను ప్రస్తావించారు. దాంతో ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని మోడి అసందర్భంగా ఎందుకు ప్రస్తావించారో అర్ధంకాలేదు.
ఈ విషయం ఇలావుండగానే హఠాత్తుగా విభజన హామీల అమలుకు ఒక కమిటిని వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈనెల 17వ తేదీన భేటీ అవుతున్న కమిటి తొమ్మిది అంశాలపై చర్చిస్తుందని ప్రకటించింది. ఇందులో ప్రత్యేకహోదా కూడా ఒకటుందని స్వయంగా కేంద్రమే ప్రకటించింది.
అజెండా చూడగానే జనాలందరిలో మళ్ళీ ప్రత్యేకహోదాపై ఎక్కడలేని ఆశలు చిగురించాయి. ఏపీకి ప్రత్యేకహోదా వచ్చేసినట్లే అని అనుకోవటం మొదలుపెట్టారు. అయితే రాత్రికి అజెండా కుదించేయటం, అందులో నుండి ప్రత్యేకహోదా అంశం ఎగిరిపోవటంతో జనాలంతా కేంద్రంపై మండిపోతున్నారు.
ఏదేమైనా ప్రత్యేకహోదా అంశం ఇంకా లైవ్ లోనే ఉందనే విషయం బయటపడింది. అజెండాలో నుండి హోదా అంశం ఎందుకు మాయమైపోయిందనే విషయాన్ని పక్కనపెట్టేస్తే ఈరోజు కాకపోతే రేపైనా మళ్ళీ ఇదే అంశంపై కేంద్రం తప్పకుండా చర్చకు తీసుకొస్తుందనే నమ్మకం జనాల్లో పెరిగిపోయింది.
ఇక అజెండాలో నుండి హోదా అంశం ఎందుకు మాయమైపోయిందనే విషయమై పెద్దఎత్తున చర్చలు మొదలైనాయి. రాజకీయ కారణాలతోనే ప్రస్తుతం హోదా అంశం మాయమైనా మళ్ళీ ఏదో కారణంతో అజెండాలో కచ్చితంగా చర్చకు వస్తుందనే నమ్మకం పెరుగుతోంది.
బహుశా ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కావచ్చు లేదా వచ్చే లోక్ సభ ఎన్నికలకు ముందైనా కావచ్చు. ఏదేమైనా ప్రత్యేకహోదా అంశం చర్చకు రావటం, అమల్లోకి రావటం ఖాయమనే విషయంపై ఆశలు పెరిగిపోతున్నాయి. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.