Begin typing your search above and press return to search.
ప్రభుత్వ అప్పులన్నీ ఒప్పులే... సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి క్రిష్ణ
By: Tupaki Desk | 11 May 2023 4:12 PM GMTఏపీలో అప్పులు పెరిగిపోయాయని, మరో శ్రీలంకగా మారిపోతోంది అని తప్పుడు ప్రచారం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి క్రిష్ణ పేర్కొన్నారు. ఈ రోజు సచివాలయంలో ఆయన మీడియా మీట్ పెట్టి మరీ ప్రభుత్వ అప్పుల మీద సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు.
పబ్లిక్ ఫైనాన్స్ మీద అవగాహన లేని వారంతా వక్రంగా విశ్లేషణలు చేస్తూ కోట్లాది మంది ఏపీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని మండిపడ్డారు. ఒక ప్రముఖ మీడియా సంస్థ తన చానల్ లో డిబేట్ పెట్టి మరీ జీవీ రావు అనే ఆయన చేత ఏపీ ఆర్ధిక పరిస్థితి మీద తప్పుడు విశ్లేషణ చేయించిందని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వం ఎంత అప్పు చేసింది అన్నది కచ్చితంగా పబ్లిక్ డొమైన్ లో ఉంటుందని, ఈ విషయం ఎవరూ దాచలేరని అన్నారు. లక్షల కోట్ల వ్యవహారం ఎలా గుప్తంగా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఆర్బీఐ కూడా ఎప్పటికపుడు మోనిటరింగ్ చేస్తూ అన్ని వివరాలు బయటపెడుతుందని అన్నారు.
ఏపీ లో ఎంత అప్పు ఉందని ప్రభుత్వం పదే పదే స్పష్టం చేసినా కూడా దాన్నే అతి పెద్ద సందేహంగా మారుతున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. 2014 లో ఉమ్మడి ఏపీ విడిపోయాక ఆంధ్రాకు లక్షా 18 వేల పై చిలుకు అప్పు ఉంది. 2019 లో చంద్రబాబు పాలన నుంచి దిగిపోయేనాటికి ఆ అప్పు కాస్త రెండు లక్షల 71 వేల కోట్ల దాకా ఉందని అన్నారు.
గడచిన నాలుగేళ్ళ కాలంలో అప్పు పెరిగి నాలుగు లక్షల 42 వేల 462 కోట్ల రూపాయలకు చేరిందని ఆయన వివరించారు. ప్రభుత్వం అప్పులు వివిధ మార్గాల ద్వారా తీసుకోవచ్చు అని ఆయన స్పష్టం చేశారు అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు చేసే అప్పుల కు ప్రభుత్వం పూచీకత్తుగా ఉండడం కూడా రాజ్యంగం ప్రకారం సంక్రమించిన అధికారం అని ఆయన పేర్కొన్నారు.
అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలు చేసే అప్పుల మీద ఎప్పటికపుడు వివరణ ఇస్తున్నామని దువ్వూరు క్రిష్ణ వివరించారు. ఏపీ ఆర్ధిక పరిస్థితి బాగానే ఉందని ఆయన చెప్పారు. 2005లో రూపొందించిన ఎఫ్ ఆర్ బీఎం చట్టానికి లోబడే ఏపీ అప్పులు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ప్రతీ దానికీ జవాబుదారీతనం ఉందని, బాధ్యతగానే ప్రభుత్వం అన్ని విషయాలను ప్రజల ముందు ఉంచుతోందని, ఇందులో దాచేస్తే దాగేది ఏదీ ఉండదని అన్నారు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్ లో చెప్పిన తరువాత కూడా ఇంకా ఏపీ అప్పుల మీద తప్పుడు ప్రచారం చేయడం భావ్యమేనా అని ఆయన ప్రశ్నించారు.
అప్పులు అన్నవి ప్రతీ ప్రభుత్వంలో చేసేవే అని అంత మాతం చేత శ్రీలంక అయిపోతుందని ఎలా చెప్పగలుగుతారని ఆయన నిలదీశారు. ఆధారాలు లేకుండా రొడ్డకొట్టుడు విమర్శలు చేయడం వల్ల ఆయా వ్యక్తులు మీడియా సంస్థలే విశ్వసనీయతను కోల్పోతారని ఆయన అంటున్నారు. మొత్తానికి వైసీపీ చేస్తున్న అన్ని అప్పుల కు లెక్కలు ఉన్నాయని అదే విధంగా అప్పులు అన్నీ ఒప్పుగా నిబంధనల మేరకు చేస్తున్నామని స్పష్టత ఇచ్చారు. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కాస్తా అటూ ఇటూ ఆలస్యం అవుతున్నాని తప్ప ఎక్కడా పెండింగులో లేవని కూడా దువ్వూరి క్రిష్ణ చెప్పారు.