Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ స‌మ‌స్య‌లు తీర‌తాయిలే.. ఆ ప‌నిచేస్తున్నారుగా...!

By:  Tupaki Desk   |   30 Nov 2021 4:30 AM GMT
జ‌గ‌న్ స‌మ‌స్య‌లు తీర‌తాయిలే.. ఆ ప‌నిచేస్తున్నారుగా...!
X
వైసీపీ నేత‌ల మ‌ధ్య ఒక విష‌యం గుస‌గుస‌గా మారింది. సీఎం జ‌గ‌న్ స‌మ‌స్య‌ల్లో ఉన్నార‌ని.. ఇటు రాజ‌కీయంగాను, అటు కుటుం బం ప‌రంగాను.. మ‌రోవైపు న్యాయ ప‌రంగాను.. ఆయ‌న అనేక చిక్కులు ఎదుర్కొంటున్నార‌ని..వారు చెవులు కొరుక్కుంటున్నారు. వాస్త‌వానికి ఆయా స‌మ‌స్య‌లు ఉన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా పాల‌న ప‌రంగా.. మ‌రో రెండున్న‌రేళ్లు ఆయ‌న నెట్టుకురావాలి. అది కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగా పాల‌న సాగించాలి. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన పొర‌పాట్ల‌ను దిద్దుకుంటూ.. మ‌రింత ఉన్న‌తంగా ఆయ‌న పాల‌న ఉండాలి. లేక‌పోతే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ఇబ్బందులు త‌ప్ప‌వు. ఈ విషయం.. స‌ర్వ‌త్రా వినిపిస్తున్న‌దే.

ఇక‌, ఇదే స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కూడా ఆయ‌న నెర‌వేర్చాలి. కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధుల‌ను ఆయ‌న తీసుకురావ‌లి. ఇక‌, అప్పులు.. సంక్షేమ కార్య‌క్ర‌మాలు.. వంటివి ప్ర‌భుత్వానికి స‌వాలుగా మారాయి. మ‌రోవైపు..పొరుగు రాష్ట్రాల‌తో ఎంత స‌ఖ్య‌త‌గా ఉంటున్నా.. ప‌నులు జ‌రుగడం లేదు. దీంతో జ‌గ‌న్‌ను ఏదో దురదృష్టం వెంటాడుతోంద‌నే చ‌ర్చ కొన్నాళ్లుగా సాగుతోంది. భారీ మెజారిటీ ఉండి కూడా.. పాల‌న విష‌యంలో త‌డ‌బాట్లు, ప్ర‌తిప‌క్షాలను క‌ట్ట‌డి చేయ‌లేక‌పోవ‌డం.. ఇలా.. అనేక అంశాల‌పై జ‌గ‌న్ ఇరుకున ప‌డుతున్నార‌నేది.. వైసీపీ నేత‌ల టాక్‌. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టార‌ని.. వారు అంటున్నారు.

కొన్ని రోజుల కింద‌ట‌.. జ‌గ‌న్‌.. స్వ‌యంగావిశాఖలోని శార‌దాపీఠానికి వెళ్లారు. అక్క‌డ స్వ‌రూపానందేంద్ర స్వామిని ద‌ర్శించుకు న్నారు. ఈ క్ర‌మంలో ఆ స్వామి.. జ‌గ‌న్‌తో ప్ర‌త్యేక పూజ‌లు కూడా చేయించారు. అయితే.. ఈ క్ర‌మంలోనే ఒక కీల‌క స‌ల‌హా ఇచ్చార‌ని.. వైసీపీలో నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. సీఎం జ‌గ‌న్ క‌ష్టాలు తొల‌గిపోవాలంటే.. జ‌గ‌న్ దంప‌తులు ఇద్ద‌రూ కూడా.. ప్ర‌తి రోజూ.. 41 రోజుల పాటు.. గోపూజ చేయాల‌ని .. ఆయ‌న సూచించార‌ట‌. ఎప్పుడూ.. స్వామి మాట‌లు విశ్వ‌సించే జ‌గ‌న్‌.. తాజాగా ఈ స‌ల‌హా విష‌యాన్ని కూడా ఆచ‌ర‌ణ‌లో పెట్టేశార‌ని.. వైసీపీ నేత‌లు చెబుతున్నారు.

త‌న‌ తాడేపల్లి నివాసంలో సీఎం జ‌గ‌న్ వెనుక భాగంలో గోశాల ఏర్పాటు చేసుకు న్నారు. తిరుపతి నుంచి 6 గోవులను ఇక్క‌డ‌కు తెచ్చారు. చిత్తూరు జిల్లా తిరుప‌తి ఎమ్మెల్యే, జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహిత నాయ‌కుడు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఈ ఆవుల‌ను తీసుకొచ్చారు. ఆ గోవులకు జగన్ సతీమణి వైఎస్ భారతి పూజచేసి ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన‌ గోశాలకు తరలించినట్టు వైసీపీ నేత‌లు చెబుతున్నారు. దీంతో జ‌గ‌న్‌కు ఉన్న దోషాలు పోయి.. పాల‌న స‌వ్యంగా సాగ‌డం ఖాయ‌మ‌ని వీరు అంటున్నారు.