Begin typing your search above and press return to search.

రావణాసురుడికి ప్రత్యేక పూజలు: ఎక్కడంటే..?

By:  Tupaki Desk   |   16 Oct 2021 7:35 AM GMT
రావణాసురుడికి ప్రత్యేక పూజలు: ఎక్కడంటే..?
X
దేశంలోని పెద్ద పండుగల్లో దసరా ఒకటి. విజయానికి సూచికగా విజయదశమి అని కూడా దీనిని పిలుస్తారు. అయితే దసరా వేడుకలను ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా నిర్వహించుకుంటారు. మొత్తంగా మాత్రం దసరా నాడు రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. రామాయణంలో సీతను ఎత్తుకెళ్లిన రావణాసురుడిని శ్రీరాముడు చివరగా అతనిని వధిస్తారు. బాణంతో విల్లును పంపి చంపేస్తారు. ఆ విజయానికి సూచికగా దసరా ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారని కొందరు అంటున్నారు. అయితే దసరా పండుగ చరిత్రపై ఎన్నో కథలున్నా రావణాసురుడి దిష్టిబొమ్మను మాత్రం దహనం చేస్తూ వస్తున్నారు. కానీ కొందరు రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేయొద్దని డిమాండ్ చేస్తున్నారు. రావణాసురుడు శ్రీరాముడికి ఎటువంటి అన్యాయం చేయలేదని ఆయనను విలన్ గా చూడొద్దని అంటున్నారు.

విజయదశమని ఉత్సవాల్లో భాగంగా చాలాచోట్ల రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్లో మాత్రం రావణాసురుడికి పూజలు చేస్తారు. ఆయన దిష్టిబొమ్మ దహనాన్ని వీరు చాలా కాలంగా వ్యతిరేకిస్తున్నారు. నిన్న జరిగిన ఉత్సవాల్లో భాగంగా ఉత్తరప్రదేశ్లోని యమునా నది ఒడ్డున ఓ శివాలయంలో రావణాసురుడికి లంకేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాకుండా రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేయడంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా లంకేష్ మిత్రమండి జాతీయాధ్యక్షుడు మాట్లాడుతూ దసరా ఉత్సవాల్లో భాగంగా దిష్టిబొమ్మను దహనం చేయడం వల్ల ఆ ప్రాంతం కలుషితంగా మారుతుందున్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకుందని, ఇలా పెద్ద ఎత్తున్న దిష్టిబొమ్మలను తయారు చేసి కాల్చడం వల్ల అందులో నుంచి రకరకాల రసాయనాలు వెలువడుతుందన్నారు. దీంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందన్నారు. దిష్టిబొమ్మల దహనంలో ఎక్కువగా బాణసంచా ఉపయోగిస్తారని,ఇందులో నుంచి వెలువడే పొగ ద్వారా పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉందన్నారు.

ఇక రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేయాల్సిన అవసరం లేదన్నారు. రావణాసురుడు శివుడి పరమ భక్తుడని, అతనికి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువే ఉన్నాయన్నారు. అయితే తన చెల్లి శూర్పనక్కకు లక్ష్మణుడు అవమానించాడని, అందుకు ప్రతీకారంగానే రావణాసురుడు సీతను తీసుకెళ్తాడన్నారు. సీతను లంకలోకి తీసుకెళ్లినా రావణాసురుడు ఆమెను గౌరవించారన్నారు. ఈ క్రమంలో రావణాసురుడిని విలన్ గా చూడాల్సిన అవసరం ఏముందన్నారు. ఓ సందర్భంలో రావణాసురుడు పురోహితుడి వేషధారణలో శ్రీరాముడి విజయం కాంక్షిస్తూ పూజలు చేశాడన్నారు.

ఈ సందర్భంగా దసరా పండుగ ఉత్సవాల్లో భాగంగా ఉత్తరప్రదేశ్లోని రావణాసురుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. కొన్ని సంవత్సరాలుగా లంకేశ్ మిత్రమండలి ఆధ్వర్యంలో రావణాసురుడికి నెయ్యి, ఖండసారి లాంటి పదార్థాలతో అభిషేకం చేస్తున్నారు. అయితే రావణారుడి దిష్టిబొమ్మను దహనం చేయొద్దని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నామని, ఈ విషయంలో ప్రభుత్వ అధికారులను కూడా కలిసి విన్నవించామన్నారు. అయితే ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. అయితే త్వరలో ప్రధాన మంత్రిని కలిసి సమస్య గురించి తెలియజేస్తామన్నారు.

ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశలో ఈసారి చాలా చోట్ల రావణాసురుడి దిష్టబొమ్మను దహనం చేయలేదు. కొవిడ్ కారణంగా రాష్ట్రంలో చాలా మంది చనిపోయారు. ప్రస్తుతం కేసులు కూడా తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రావణ దిష్టిబొమ్మల దహనాన్ని నిషేధించింది. దిష్టొబొమ్మల దహనంతో పర్యావరణం దెబ్బతిని శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ నవనీత్ సింగ్ తెలిపారు. గత రెండు సంవత్సారాలుగా కొవిడ్ నిబంధనలతో రావణ దిష్టిబొమ్మల దహనాన్ని జరగనివ్వం లేదని అంటున్నారు. అయితే లంకేశ్ మిత్రమిండలి డిమాండ్ ను ప్రభుత్వ ఏరకంగా పరిగణలోకి తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.