Begin typing your search above and press return to search.

రూపాయి విలువ పెంచేందుకు ఆర్భీఐ ప్రత్యేక చర్యలు

By:  Tupaki Desk   |   19 July 2022 2:30 AM GMT
రూపాయి విలువ పెంచేందుకు ఆర్భీఐ ప్రత్యేక చర్యలు
X
రష్యా, ఉక్రెయిన్ల యుద్ధం ప్రపంచ దేశాలపై ప్రభావం చూపుతోంది. ఇందులో భాగంగా భారత్ కూడా ఆయా దేశాల నుంచి వచ్చే వస్తువుల దిగుమతుల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఆ రెండు దేశాల యుద్ధం కారణంగా అమెరికాతో పాటు మరికొన్ని దేశాల్లో ఆర్థికమాంద్యం ఏర్పడింది. దీంతో ద్రవ్యోల్భణం సూచి ఎగబాకింది.

ఈ పరిస్థితి భారత్లోనూ ఏర్పడింది. ఫలితంగా మనరూపాయి విలువ తగ్గిపోయింది. ప్రస్తుతం డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ రూ.80కి చేరేవరకు వచ్చింది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసింది. దేశీ రూపాయి విలువ పెంచేందుకుందు పలు చర్యలు తీసుకుంటోంది.

ప్రపంచ వ్యాప్తంగా కమెడిటీల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వు రేట్ల పెంపు కూడా చేపట్టింది. ఫలితంగా భారత్ వంటి దేశాల్లో పెట్టుబడులు పెట్టేవారు ముందుకు రావడంలేదు. దీంతో రూపాయి క్షీణత పెరిగింది. అయితే ఇందుకు రష్యా, ఉక్రెయిన్ల యుద్ధమే కారణమని తెలుస్తోంది. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభం కాకముందు.. అంటే ఫిబ్రవరి 23 నాటికి రూపాయి విలువ 0. 3 శాతం తగ్గింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 6.9శాతం పతనమైంది. ఇలా మొత్తానికి రూ. 80 రూపాయలు పలికే వరకు వెళ్లింది. భారతదేశ చరిత్రలోనే ఇంత పతనం ఎప్పుడూ కాలేదు.

ఈ క్రమంలో రూపాయి విలువ రూ.80 కాకుండా రిజర్వ్ బ్యాంకు అడ్డుకట్ట వేసింది. అంతర్జాతీయ మార్కెట్లో నిల్వలను విక్రయించింది. దీంతో 50 మిలియన్ల డాలర్ల వరకు తగ్గిపోయాయి. ఫలితంగా అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి మెరుగ్గానే ఉంది. అంతర్జాతీయ వాణిజ్యంలో దేశీయ కరెన్సీకి ఆదరణ పెరిగేలా చేయాలని ఆర్బీఐ సోమవారం ఇతర బ్యాంకులను ఆదేశించింది. ఎగుమతులు, దిగుమతులు మన రూపాయల్లో జరిగేలా చూడాలని తెలిపింది. అంతర్జాతీయ వాణిజ్య వృద్ధిని ప్రోత్సహించేందుకు వీలుగా ఇన్ వాయిసింగ్, చెల్లింపులు, మన కరెన్సీలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.

ఇక విదేశీ మారక నిల్వలు పెంచేలా ఈ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచేందుకు అనుమతించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులు ఇప్పటికే వడ్డీరేట్లను మార్చాయి. గతంలో అనుమతించిన దానికంటే ఎక్కువ ప్రయోజనా కోసం అప్పుగా తీసుకున్న విదేశీ కరెన్సీని రుణంగా ఇవ్వడానికి అర్హత కలిగిన బ్యాంకులకు అక్టోబర్ 31 వరకు గడువు విధించింది. ఎక్సటర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ సమకూర్చుకునే నిధుల పరిమితిని 750 మిలియన్ డాలర్ల నుంచి 1.5 బిలియన్ డాలర్లకు పెంచింది.

ఈనెలా చివరి వారంలో ఎన్ఆర్ఈ లో పెరుగుతున్న డిపాజిట్లపై నగదు నిల్వల నిష్పత్తి నిర్వహించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ విధానంతో బ్యాంకులకు ఖర్చు తగ్గుతుంది. ఎఫ్ ఫీఐల కోసం పూర్తిగా యాక్సెస్ చేయగల మార్గం కొందకు వచ్చే సెక్యూరిటీలను 7 సంవత్సరాలు, 14 సంవత్సరాల సావరిన్ బాండ్ లను కూడా విస్తరించింది. ఒక సంవత్సరం కంటే తక్కువ కాలపరిమితి కలిగిన బాండ్లలో విదేశీ పెట్టుబడులపై 30 శాతం మించకుండా పరిమితిని తొలగించింది. ఈ చర్యలతో రూపాయి విలువ పతనం కాకుండా చేయొచ్చని ఆర్భీఐ తెలిపింది.