Begin typing your search above and press return to search.
పట్టు పెంచుకుంటున్న బండి: పార్టీ ప్రక్షాళనకు ప్లాన్
By: Tupaki Desk | 14 Jun 2020 2:30 AM GMTప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన పార్టీ.. కేంద్రంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ అయినా తెలంగాణలో ప్రభావం చూపడం లేదు. ఇంకా మూడో స్థానానికి పరిమితమైంది. అధికార పార్టీ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుదామని ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు. ఇప్పుడు కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చిన బండి సంజయ్ కుమార్ తన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో బీజేపీని బలోపేతం చేసేలా కార్యాచరణ మొదలు పెట్టాడు. ముందు సొంత పార్టీలోనే ప్రక్షాళన అవసరమని భావిస్తున్నాడు.
పార్టీలో సీనియర్ల వారసులుగా పదవులు అనుభవిస్తూ పార్టీకి నష్టం చేస్తున్న వారిని గుర్తించి వారికి చెక్ పెట్టేందుకు సంజయ్ సిద్ధమయ్యారని తెలుస్తోంది. పార్టీకోసం నిజంగా కష్టపడి పని చేసే వారికి సంస్థాగత పదవులు అప్పగించాలని చూస్తున్నారు.
పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత, సొంత పార్టీలోనే ప్రక్షాళన మొదలుపెట్టారు. తనకు పార్టీలో ఉన్న విరోధులను టార్గెట్ చేశారు. ఏళ్లుగా పార్టీలో వున్న కొంతమందిపై కాన్‌సన్‌ట్రేట్ చేశారు. కొందరు సీనియర్లు, వారి అనుచరగణంపై ప్రత్యేక దృష్టి సారించారు.
అధ్యక్షుడిగా నియమితులైనప్పటి నుంచి సంజయ్‌కి సీనియర్లు సహకరించడం లేదు. పార్టీలో తన మార్క్ చూపెట్టేందుకు భారీ మార్పులు చేయాలని సంజయ్ ప్లాన్. ఈ క్రమంలోనే జిల్లా అధ్యక్షులతో పాటు ఇతర కమిటీల నియామకాల్లో తన టీమ్‌ను రంగంలోకి దించుతున్నారట. పార్టీలో తన పట్టు సాధించేందుకు సంజయ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం చర్యలు చేపట్టారు. , అందులో భాగంగానే ఇటీవల 7 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించి, సీనియర్లకు ఒకరకంగా షాకిచ్చారు సంజయ్. ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా పార్టీ సీనియర్లకు షాకివ్వబోతున్నట్టు సమాచారం. పార్టీ గ్రేటర్ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ రామచందర్ రావు గడువు ముగియడంతో కొత్తవారిని నియమించే ఆలోచనలో సంజయ్ ఉన్నాడు. జీహెచ్‌ఎంసీ పరిధిలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు వేరువేరుగా కమిటీలు వేసేందుకు కసరత్తు చేస్తున్నారని సంజయ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ విధంగా ఒక ప్రణాళికగా సంజయ్ ముందుకు వెళ్తున్నాడు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని భావిస్తున్నారు. పార్టీలో సీనియర్లను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా, తన మార్క్ ఉండాలని సంజయ్ శ్రమిస్తున్నాడు. ఈ విధంగా పార్టీలో మార్పులు చేర్పులు చేసి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా పార్టీని నిలపడమే సంజయ్ ధ్యేయం. ఆ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.