Begin typing your search above and press return to search.
రఫేల్ వచ్చేసింది.... దాని ప్రత్యేకతలేమిటంటే?
By: Tupaki Desk | 29 July 2020 4:30 PM GMTయావత్తు భారత దేశం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రఫేల్ యుద్ధ విమానాలు ఎట్టకేలకు బుధవారం వచ్చేశాయి. ఫ్రాన్స్ లో తయారీ అయిన రఫేల్ యుద్ధ విమానాల కోసం భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చించింది. గతంలో ఎన్నడూ లేనంత రీతిలో భారీ ధర చెల్లించి మరీ కేంద్ర ప్రభుత్వం ఈ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. మొత్తం 36 రఫేల్ వినామాల కోసం భారత్ ఏకంగా రూ.58 వేల కోట్లను వెచ్చించింది. ఈ లెక్కన ఒక్కో రఫేల్ యుద్ధ విమానం ఖరీదు రూ.1,611 కోట్లన్న మాట. ఇంత ఖరీదు పెట్టి ఈ విమానాలను కొనాల్సిన అవసరం ఏముందన్న విషఁయం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే రఫేల్ ప్రత్యేకతల గురించి తెలిస్తే మాత్రం... ఈ యుద్ధ విమానాల కోసం ఈ మేర ధర చెల్లించడం సబబేనని ఒప్పుకోక తప్పదు.
రఫేల్ యుద్ధ విమానాల నుంచి సైన్యం అత్యంత ఆదునికమైన ఆయుధాలను ప్రయోగించే అవకాశం ఉంది. ఒకేసారి 9,500 కిలోల బరువున్న ఆయుధాలను రఫేల్ విమానం మోసుకెళ్లగలదు. అంతేకాదండోయ్... రఫేల్ యుద్ధ విమానాల నుంచి ఏకంగా అణ్వస్త్రాలను కూడా ప్రయోగించే వీలుందట. రఫేల్ పేరుకు ఓ రకమైన యుద్ధ విమానమే అయినా.. దీనిపై నుంచి రెండు రకాల క్షిపణులను ప్రయోగించే వెసులుబాటు ఉందట. 150 కిలో మీటర్ల రేంజ్ ఉన్న క్షిపణులను ప్రయోగించగల రఫేల్... అదే సమయంలో ఏకంగా 300 కిలో మీటర్ల రేంజ్ కలిగిన క్షిపణులను కూడా అవలీలగా ప్రయోగిస్తుందట. అంతేనా... గాలిలో నుంచి గాలిలోని లక్ష్యాలను చేధించడమే కాకుండా గాలిలో నుంచి భూతలంపై ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించడం రఫేల్ ప్రత్యేకత అంట.
ఇక రఫేల్ కు ఉన్న మరో ప్రత్యేక విషయమేంటంటే... గంటకు 1,300 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించగలిగే ఈ విమానం... శత్రు దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పుపై ఏకంగా 360 డిగ్రీల కోణంలో నిఘా పెట్టగలదట. అంటే... ఏదో తనకు ఎదురుగా వస్తున్న ప్రమాదాన్నే కాకుండా తానున్న ప్రాంతం నుంచి తన చుట్టూ జరిగే కుట్రలను కూడా రఫేల్ పసిగడుతుందట. మొత్తంగా శత్రువులు ఎటు నుంచి ఎటు దాడి చేసినా కూడా రఫేల్ కళ్లు గప్పి దూసుకువచ్చే ప్రమాదమే లేదంట. ఇన్నిన్ని ప్రత్యేకతలున్నందునే ఈ యుద్ధ విమానాల కోసం భారత్ భారీ ఎత్తున నిధులను వెచ్చిచిందన్న మాట. ఇక ఈ తరహా యుద్ధ విమానాలు వీటిని తయారు చేస్తున్న ఫ్రాన్స్ తో పాటు ఈజిప్టు, ఖతార్ దేశాల వద్ద మాత్రమే ఉన్నాయట. ఇప్పుడు కొత్తగా ఈ దేశాల జాబితాలో భారత్ కూడా చేరిందన్న మాట.