Begin typing your search above and press return to search.
ట్రంప్ కోసం ప్రత్యేక కరోనా ఔషధం.. ఇలా కోలుకున్నాడట..!
By: Tupaki Desk | 11 Oct 2020 7:50 AM GMTఅగ్రరాజ్యపు అధినేత.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా బారినపడడం సంచలనమైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ప్రచారంలో ఆయన ఈ వైరస్ బారినపడ్డారు. 74 ఏళ్ల ట్రంప్ కు ఈ వైరస్ హాని చేస్తుందని.. ఆయనకు డేంజర్ అని ప్రచారం జరిగింది. ఆస్పత్రిలో కూడా ట్రంప్ చేశారు. కానీ మొత్తానికి నాలుగు రోజులు ఆస్పత్రిలో గడిపి తిరిగి శ్వేత సౌధానికి చేరుకున్నారు. వచ్చి రాగానే మాస్క్ తీసేశారు.
ఈ క్రమంలోనే ఇంత త్వరగా ట్రంప్ కోలుకోవడానికి కారణం ఏంటి? ఆయనకు ఏం మందులు ఇచ్చారు అనే చర్చ మొదలైంది. నాలుగురోజుల్లోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ట్రంప్ ఎంతో హుషారుగా కనిపించడంతో అంతా ఆశ్చర్యపోయారు. ట్రంప్ కోలుకోవడం వెనుక ఏ కరోనా మందులున్నాయన్నది హాట్ టాపిక్ గా మారింది.
అయితే ట్రంప్ వైద్యుల కృషి ఫలితంగానే ఆయన త్వరగా కోలుకున్నట్టు తెలిసింది. వ్యాధి సోకినట్టు నిర్ధారణ కాగానే ట్రంప్ కు రెండు యాంటీబాడీలను ఇచ్చారు వైద్యులు. ఈ యాంటీ బాడీలను సింగపూర్ కు చెందిన ముగ్గురు పేషంట్ల రక్త నమూనాలతో రూపొందించారని ఆసియన్ సైంటిస్ట్ మ్యాగజైన్ కథనంలో రాసింది.
ఈ యాంటీ బాడీ థెరపీని ఆర్ఈజీఎన్-సీవోవీ2గా పేర్కొంటారు. మిలటరీ ఆస్పత్రిలో ట్రంప్ కు మూడు రోజులు యాంటీ వైరల్ డ్రగ్స్, స్టెరాయిడ్స్ ఇచ్చారు. వాటిన్నింటి వల్ల ట్రంప్ తొందరగా కోలుకున్నారని చెబుతున్నారు.
యాంటీ బాడీ థెరపీని ఆర్ఈజీఎన్-సీవోవీ2 థెరపీని వాడడానికి ఇంకా అనుమతులు రాకపోయినా ట్రంప్ కోసం ప్రత్యేక అనుమతి తీసుకొని వాడారని చెబుతున్నారు. అసలే అధ్యక్ష ఎన్నికల సమయం కావడంతో ట్రంప్ సిద్ధమై త్వరగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.
శనివారం కరోనా నుంచి కోలుకొని ట్రంప్ వైట్ హౌస్ ముందు బయట పెద్ద సంఖ్యలో చేరిన తన మద్దతు దారులను ఉద్దేశించి మాట్లాడారు. ‘ఐయామ్ ఫీలింగ్ గ్రేట్’ అంటూ ప్రకటించారు. ఓటు వేయండని.. ఐలవ్ యూ ఆల్ అంటూ ఉత్సాహ పరిచారు.
ట్రంప్ లో వైరస్ ఆనవాళ్లు పూర్తి తగ్గాయని.. ఏం లేవని డాక్టర్ స్పష్టం చేశారు.