Begin typing your search above and press return to search.
ఆన్ లైన్ రమ్మీపై నిషేధానికి స్పెషల్ కమిటీ...
By: Tupaki Desk | 11 Jun 2022 8:54 AM GMTఅందమైన ఫ్యామిలీలో జీవించే ఓ వివాహిత ఆన్లైన్ రమ్మీ క్రీడను ఆడేందుకు అలవాటు పడింది.. ఆ తరువాత రూ.3 లక్షలు, 20 కిలోల బంగారాన్ని పోగొట్టుకుంది..అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంది. లాక్డౌన్లో ఇంట్లో ఉండడం వల్ల ఓ యువతి రమ్మీ ఆడడం మొదలు పెట్టింది.. ఆ తరువాత తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా రమ్మీ ఆడింది.. ఆ తరువాత లక్షలు పోగొట్టుకుంది..
ఇలా రమ్మీ బాధితులు తమిళనాడులో విపరీతంగా పెరిగిపోతున్నారు. షార్ట్ కట్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చనే ఆలోచనతో ఆన్ లైన్ రమ్మీకి బానిసవుతున్నారు. ఒక్కసారి ఈ ఆట వలలో చిక్కుకున్న తరువాత అందులో నుంచి బయటపడలేకపోతున్నారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఆన్ లైన్ రమ్మీ నిషేధానికి చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రీడ నిషేధానికి అత్యవసర చట్టం రూపొందించాలని నిర్ణయించింది. ఈ మేరకు చెన్నై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రూ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని వేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఆన్ లైన్ రమ్మీ నిషేధానికి గత అన్నాడీఎంకే ప్రభుత్వం 2021 ఫిబ్రవరి 25న ప్రత్యేక చట్టాన్ని తెచ్చింది. అయితే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆన్ లైన్ క్రీడల నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. సరైన ఆధారాలు లేనందున ఈ చట్టం చెల్లదంటూ అదే ఏడాది ఆగస్టు 3న తెలిపింది.అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సెప్టెంబర్ 13న సుప్రీం కోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేశారు.
కానీ ఆ పిటిషన్ పై ఎలాంటి విచారణ జరగలేదు. ఈ నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వం ఇప్పుడు ఆన్ లైన్ రమ్మీని నిషేధానికి ప్రత్యేక చట్టం రూపొందించనున్నారు. గురువారం ఈ విషయంపై పోలీసులు, ఇతర శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన సమగ్రంగా చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన నిషేధ చట్టాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంది.
జస్టిస్ చంద్రూ కమిటీలో ఐఐటీ సాంకేతిక నిపుణుడు డాక్టర్ శంకర్ రామన్, స్నేహ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ లక్ష్మీ విజయకుమార్, పోలీసుశాఖ అదనపు డైరెక్టర్ వినిత్ దేవ్ వాఖండే సభ్యులుగా ఉన్నారు. ఆన్ లైన్ రమ్మీ వల్ల జరిగే ఆర్థిక, ప్రాణ నష్టాలను, క్రీడల వైపు ప్రేరేపించే ప్రకటనలు ప్రజలపై చూపుతున్న ప్రభావాల గురించి పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. రెండు వారాల్లోపు ఈ నివేదికను అందించాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు.
ఆన్ లైన్ రమ్మీ క్రీడను నిషేధించాలని ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. ఈ క్రీడ వల్ల చాలా మంది మహిళలే బానిసలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటున్నారు. ఈ మేరకు ఆన్ లైన్ రమ్మీ క్రీడకు వ్యతిరేకంగా ఈనెల 10న వన్నియార్ సమాజిక వర్గానికి చెందిన రాజకీయ విభాగం పాటలీ మక్కల్ కట్చి పిలుపునిచ్చింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 22 మంది ఆన్ లైన్ రమ్మీ మాయలో పడి ఆత్మహత్యలు చేసుకున్నారని పీఎంకే అధ్యక్షుడు, కేంద్ర మాజీ ఆరోగ్యశాఖ మంత్రి అన్భుమణి రాందాస్ ఒక ప్రకటనలో తెలిపారు.