Begin typing your search above and press return to search.

కేటీఆర్ రోడ్ షోల వెనుక ఇంత జరుగుతుందా?

By:  Tupaki Desk   |   23 Nov 2020 1:30 PM GMT
కేటీఆర్ రోడ్ షోల వెనుక ఇంత జరుగుతుందా?
X
గ్రేటర్ ఎన్నికల్ని గులాబీ బాస్.. ఆయన కొడుకు కమ్ చిన్న బాస్ ఇద్దరు ఎంత సీరియస్ గా తీసుకున్నారో తెలిసిందే. దుబ్బాక ఓటమిని మరచిపోయేలా గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఉండాలని వారు ఆశిస్తున్నారు. అందుకోసం దేనికైనా రెఢీ అన్నట్లు వ్యవహరిస్తున్న వారు.. అందుకు సంబంధించిన గ్రౌండ్ వర్కును ఇప్పటికే పూర్తి చేశారు. ప్రతి డివిజన్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో సాధించిన 99 మార్కుకు తగ్గకుండా ఉండాలన్నది వారి లక్ష్యంగా చెబుతున్నారు. ప్రచారంలో భాగంగా తాము చెబుతున్నట్లు 105 స్థానాలు కాకున్నా.. గతానికి తగ్గకుండా ఉండటం ద్వారా.. తమ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదన్న విషయాన్ని చెప్పాలన్నది ఉద్దేశం.

ఇందులో భాగంగా ఇప్పటికే పలు వ్యూహాల్నిసిద్ధం చేసుకున్న పార్టీ ఇప్పుడు రోడ్ షోల మీద ఫోకస్ పెట్టింది. గ్రేటర్ ఎన్నికలకు నాయకత్వం వహిస్తున్న కేటీఆర్.. ఆ భారం మొత్తం తానే మోస్తున్నట్లుగా వ్యవహరిస్తూ నిర్వహిస్తున్నారు. అంతేకాదు.. తన రోడ్ షోలకు భారీగా జన సమీకరణ ఉండేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ బాధ్యతను డివిజన్ కు ఇంఛార్జిలుగా నియమించిన వారికి అప్పగించారు. రోడ్ షోలు కిక్కిరిసిపోయేలా ఉండేందుకు.. జన సమీకరణ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించినట్లు చెబుతున్నారు.

తన రోడ్ షో కారణంగా అభ్యర్థులపై అదనపు భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించి.. పార్టీ ముఖ్యులకు బాధ్యత అప్పజెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో.. రోడ్ షో కారణంగా తమ మీద పడే భారాన్ని లెక్కేసుకొని భయపడిన వారంతా ఇప్పుడు మా గొప్ప రిలీఫ్ గా ఫీల్ అవుతున్నారు. అంతేకాదు.. జన సమీకరణ కోసం చేసే ఖర్చు కిందిస్థాయి నాయకులకు వెళ్లటం.. అందులో భారీగా గిట్టుబాటు కావటంతో కేటీఆర్ రోడ్ షో సదరు చోటా నేతలందరికి పండుగా మారిందంటున్నారు. మొత్తానికి యువ నేత రోడ్ షో అందరికి అన్ని విధాలుగా మేలు చేస్తుందని చెప్పక తప్పదు.