Begin typing your search above and press return to search.

పీఎం కాన్వాయ్ లో స్పెషల్ అట్రాక్షన్ ఆ కారు.. ధర ఎంతంటే?

By:  Tupaki Desk   |   28 Dec 2021 9:37 AM GMT
పీఎం కాన్వాయ్ లో స్పెషల్ అట్రాక్షన్ ఆ కారు.. ధర ఎంతంటే?
X
దేశ ప్రధాని అంటే ఖరీదైన కార్లు కాన్వాయ్ మినిమమ్ ఉండాల్సిందే. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాన్వాయ్ లో కొన్ని ప్రత్యేక కార్లు ఉన్నాయి. కాగా ఆ జాబితాలో మరో కొత్త కారు చేరింది. కాన్వాయ్ లోని మెర్సిడెజ్-మే బ్యాచ్ s650 మోడల్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చాలామంది ఈ కారు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ కారు ధర ఎంత అని శోధిస్తున్నారు. ప్రధాని కాన్వాయ్ లోని ఆ స్పెషల్ కారు రేటు రూ.12 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.

ప్రధాని కాన్వాయ్ లో చేరిన కొత్త కారు మెర్సిడెజ్-మే బ్యాచ్ s650లో చాలా ఫీచర్లు ఉన్నాయి. దాదాపు రూ.12 కోట్లు పైగా ఉండే ఈ కారు 2019 మోడల్ లో సరికొత్త సదుపాయాలు ఉన్నాయి.

ఈ మోడల్ లో బుల్లెట్ ప్రూఫ్, బయో దాడుల నుంచి రక్షణ పొందే కవచం, బాంబు పేలుళ్ల నుంచి కాపాడే సదుపాయాలతో ఈ సరికొత్త కారు అందుబాటులోకి వచ్చింది. దేశ ప్రధాని కి కావాల్సిన పూర్తి భద్రతతో కూడిన వాహనానికి ఇది బాగా సరిపోతుందని నిపుణులు సలహా ఇచ్చారు. ఈ మేరకు ప్రధాని కాన్వాయ్ లో దీనిని చేర్చినట్లు తెలుస్తోంది.

ఈ మెర్సిడేజ్ కారు ఇంజిన్ ఎప్పటికీ పేలకుండా ఉండేలా తయారు చేశారు. ఆ విధంగా ప్రత్యేకమైన మెటల్స్ తో దీన్ని రూపొందించారు. కారు భద్రత స్థాయి 10 ఉంటుంది. రూ.12 కోట్ల విలువ చేసే ఈ కారులో అన్ని రకాల ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా స్టైలిష్ లుక్ లో ఇది అందరినీ ఆకర్షిస్తోంది.

ఈ న్యూ అండ్ స్టయిలిష్ కారులో ప్రధాని ఇటీవల ప్రయాణం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు స్వాగతం పలికేందుకు ప్రధానమంత్రి మోదీ దీనిలో వచ్చారు. ఆ సమయంలో కారు మరింత స్టైలిష్ గా కనిపించింది. ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.