Begin typing your search above and press return to search.

ఆర్టీసీ గురించి ఆమర్యాదగా మాట్లాడితే ఒప్పుకునేదేలేదు : సజ్జనార్ ట్వీట్

By:  Tupaki Desk   |   22 Nov 2021 10:53 AM GMT
ఆర్టీసీ గురించి ఆమర్యాదగా మాట్లాడితే ఒప్పుకునేదేలేదు : సజ్జనార్ ట్వీట్
X
సజ్జనార్ టిఎస్ ఆర్టీసీ ఎండి గా ఇటీవలే బాధ్యతలు తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే, బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజులలోనే రాపిడో సంస్థకు నోటీసులు జారీ చేశారు. ఆర్టీసీని తక్కువగా చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. అయితే తాజాగా టి ఎస్ ఆర్టీసీ బస్సు స్పెషల్ ఏంటో తెలుసా అంటూ ఓ మీమ్ ను షేర్ చేశారు. అందులో అమలాపాల్ ఏముంది రా మీ ఆర్టీసీలో స్పెషల్ అని అడగగా,. నా ఆర్టీసీ బస్సులో స్పెషల్ ఏముందా 100 రూపాయల టి 24 టికెట్ కొనుక్కుని హైదరాబాద్ మొత్తం తిరుగుతాము.

నువ్వు 100 రూపాయల పెట్రోల్ కొట్టుకుని నీ ఆడి కార్ లో హైదరాబాద్ మొత్తం తిరగగలవా, 200 రూపాయలు పెట్టి స్టూడెంట్ పాస్ తీసి నెల మొత్తం తిరుగుతా. అదే నువ్వు 200 పెట్రోల్ కొట్టించుకుని నీ ఆడి కార్ లో నెల రోజులు కాదు కనీసం ఒక్కరోజైనా తిరగగలవా, 50 మంది ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసుకుంటూ జర్నీ చేస్తా. నీ కార్ లో కనీసం 10 మందిని అయినా ఎక్కించుకోగలవా, కారును బుక్ చేసుకోవాలంటే ముందే సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. అదే బస్సుకు అయితే అదేం అక్కర్లేదు.

ఇంకోసారి టిఎస్ ఆర్టీసీ గురించి తక్కువ చేసి మాట్లాడితే మర్యాదగా ఉండదు చెప్తున్నా అంటూ ధనుష్ సమాధానం ఇస్తాడు. ప్రస్తుతం సజ్జనార్ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. టీఎస్ ఆర్టీసీని తక్కువ చేస్తూ ఇటీవల రాపిడో అనే సంస్థ చేసిన యాడ్ విషయమై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్, రాపిడో సంస్థ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ డిమాండ్ చేశారు. అంతకుడు సెలెబ్రిటీలు కమర్షియల్ యాడ్ లు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, డబ్బుల కోసం ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని, ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.