Begin typing your search above and press return to search.

వేదికపై క్రాకర్స్.. దహనమైన సింగర్

By:  Tupaki Desk   |   3 Sep 2019 5:29 AM GMT
వేదికపై క్రాకర్స్.. దహనమైన సింగర్
X
ఉత్సాహం ఉరకలెత్తించేలా సాగే ఒక మ్యూజిక్ షోలో కలలో కూడా ఊహించని రీతిలో చోటు చేసుకున్న విషాదం ఇప్పుడు సంచలనంగా మారింది. సంగీత ప్రదర్శన ఇస్తున్న వేళ.. ఒక సింగర్ మరణించిన తీరు కలిచివేసేలా మారింది. ప్రముఖ స్పానిష్ పాప్ స్టార్ కమ్ డాన్సర్ జోయానా సెయిన్స్ తాజాగా దుర్మరణం పాలయ్యారు. సూపర్ హాలీవుడ్ ఆర్కెస్ట్రా బృందంతో కలిసి షో ఇస్తున్న జోయానా.. అనూహ్య పరిణామంలో మరణించారు.

కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతం మాడ్రిడ్ కు 130 కిలోమీటర్ల దూరంలో ఉండే లాస్ బెర్లనాస్ అనే చిన్న పట్టణంలో ఒక మ్యూజిక్ షోను ఏర్పాటు చేశారు. 15 మంది సభ్యులున్న సూపర్ హాలీవుడ్ ఆర్కెస్ట్రా సంగీత కార్యక్రమాన్ని చేపట్టింది. ఉత్సాహాంగా సాగిన ఈ షోను ముగించే ముందు.. వేదిక మీద భారీగా క్రాకర్స్ ను కాల్చారు. అనూహ్యంగా బాణసంచాను కాలే వేళ.. రెండు రాకెట్లు దూసుకొచ్చి జోయానా సెయిన్స్ కడుపులోకి వెళ్లాయి. దీంతో.. ఆమె మంటల్లో చిక్కుకున్నారు. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామానికి షాక్ చెందిన సహచరులు.. కార్యక్రమ నిర్వాహకులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

అయితే.. అప్పటికే ఆమె ప్రాణాలు విడిచినట్లుగా వైద్యులు పేర్కొన్నారు. జరిగిన విషాదంపై తీవ్రమైన షాక్ లో మునిగిపోయింది అర్కెస్ట్రా గ్రూపు. బాణసంచాలో పేలుడు పదార్థాన్ని మోతాదుకు మించి కూర్చటం వల్లే ఇలాంటి ఘటన చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. గడిచిన ఐదేళ్లుగా తమ ప్రదర్శన సందర్భంగా ఇలా బాణసంచాను కాల్చినప్పటికీ ఎప్పుడూ ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోలేదని చెబుతున్నారు. విషాదకరమైన విషయం ఏమంటే.. షో ముగియటానికి సరిగ్గా 15నుంచి 20 సెకన్ల ముందు ఈ దారుణం చోటు చేసుకున్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. ఉత్సాహంగా మొదలైన కార్యక్రమం మర్చిపోలేని విషాదంతో ముగియటాన్ని అక్కడి సంగీతాభిమానులు.. ఆర్కెస్ట్రా బృందం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.