Begin typing your search above and press return to search.

‘స్పామ్ కాల్స్’​ భారత్​ ను భయ పెడుతున్నాయి.. ఏపీ లోనూ అదే పరిస్థితి..!

By:  Tupaki Desk   |   10 Dec 2020 3:42 AM GMT
‘స్పామ్ కాల్స్’​ భారత్​ ను భయ పెడుతున్నాయి.. ఏపీ లోనూ అదే పరిస్థితి..!
X
స్పామ్ కాల్స్.. స్మార్ట్​ఫోన్​ వినియోగదారులకు ఈ పదం అలవాటే. ప్రతిరోజు మనకు అనేక అపరిచితకాల్స్​ వస్తుంటాయి. క్రెడిట్​కార్డు, డెబిట్​కార్డు, బ్యాంక్​లోన్​, గిఫ్ట్​ల పేరుతో ఎవరో ఒకరు ఫోన్​చేసి విసిగిస్తుంటారు. ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ భారత్​లోనూ ఎక్కువగానే ఉన్నది. స్పామ్​కాల్స్​తో ఇబ్బంది పడే దేశాల జాబితాలో మనదేశం కూడా చేరిపోయింది. స్పామ్ కాల్స్ పై 'ట్రూకాలర్ ఇన్ సైట్స్ రిపోర్ట్ 2020’ లో ఈ విషయం వెల్లడైంది. లాక్​డౌన్​ సమయంలోనూ ప్రజలకు స్పామ్​కాల్స్​ బెడద తప్పలేదని ట్రూకాలర్​ పేర్కొన్నది.

మన నంబర్లను ఎలాగోలా సంపాదించి.. ఆన్​లైన్​ వ్యాపారంటూ మోసం చేయడం, మార్కెట్​ ప్రమోషన్ల కోసం వాడుకోవడం తరచూ జరుగుతున్నది. వీటి ఎఫెక్ట్​తో ప్రతిరోజు వేలసంఖ్యలో సామాన్యులు మోసపోతున్నారు. గిఫ్ట్​లు వచ్చాయంటూ సామాన్యులను మోసం చేసి .. వారి అకౌంట్​లోని డబ్బులు గుల్లచేస్తున్నారు కేటుగాళ్లు. మరోవైపు ఆంధ్రప్రదేశ్​లోనూ స్పామ్​కాల్స్​ బెడద ఎక్కువగానే ఉన్నది. ట్రూకాలర్ అధ్యయనం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది స్పామ్ కాల్స్ 18 శాతం పెరిగాయి. 2020లో యూజర్లు మొత్తం 31.3 బిలియన్ల స్పామ్ కాల్స్‌ను తీసుకున్నారు. బ్రెజిల్​లో ఈ స్పామ్​ కాల్స్​ ఎక్కువగా వస్తున్నాయి. అక్కడ సగటున ఓ వినియోగదారుడికి నెలకు 50 స్పామ్​కాల్స్​ వస్తున్నాయట.

యూఎస్, హంగేరి, పోలాండ్, స్పెయిన్, ఇండోనేషియా, యూకే , ఉక్రెయిన్, ఇండియా, చిలీ దేశాలు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.ఇండియాలో నెలకు 17 స్పామ్​ కాల్స్​ వస్తున్నాయని నివేదిక తేల్చింది. స్పామ్​కాల్స్​ బెడదతో మనదేశంలో గుజరాత్​ టాప్​లో ఉంది. ఉంది. గుజరాత్ లో ఒక యూజర్ కు నెలకు సరాసరి 13.5 స్పామ్ కాల్స్ అందుతున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (13.2శాతం) ఉండగా, ఆంధ్రప్రదేశ్ (9.5 శాతం)మూడో స్థానంలో నిలిచింది. గిఫ్ట్​వోచర్లు, మొబైల్​ ఆఫర్లు, రియల్​ఎస్టేట్​ వెంచర్లు తదితర ప్రమోషన్ల కోసం ఈ స్పామ్​ కాల్స్​ వస్తున్నట్టు ట్రూకాలర్​ తేల్చింది.