Begin typing your search above and press return to search.
కరోనా భయంతో లక్ష జంతువుల్ని చంపేయాలని ఆదేశం
By: Tupaki Desk | 19 July 2020 12:30 AM GMTమింక్.. కుందేళ్ల వలే ఉండే ఈ జంతువులు స్పెయిన్ దేశంలో పెంచుతారు. వాటి చర్మంతో ఉన్ని తయారు చేస్తారు. చలి నుంచి రక్షణ కోసం వాటి చర్మం ఉపయోగపడుతుంది. ఫామ్ లలో లక్షలాది వాటిని మన కోళ్లలాగా అక్కడి వారు పోషిస్తారు. తాజాగా అందులో ఉన్న లక్ష మింక్ జంతువులను చంపేయాలని స్పెయిన్ దేశ అధికారులు నిర్ణయించారు.
కారణం ఏంటంటే.. ఆ ఫామ్ లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి భార్య మే నెలలో కరోనా వైరస్ తో ఇన్ఫెక్షన్ కు గురయ్యారు. ఆ తర్వాత ఆమె భర్త, ఆయనతోపాటు ఫామ్ లో పనిచేస్తున్న ఆరుగురికి కూడా వైరస్ సోకింది.
దీంతో ఫామ్ లో ఉన్న జంతువులను అధికారులు విడిగా ఉంచి పరిశీలించారు. జూలై 13నాటికి పరీక్షలు చేయగా.. దాదాపు 87శాతం జంతువులకు ఇన్ఫెక్షన్ వ్యాపించింది. దీంతో ఆ ఫామ్ లోని మొత్తం 92700 మింక్ లను చంపేయాలని ఆదేశించారు. ఫామ్ నడుపుతున్న సంస్థకు పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
మనుషుల నుంచి జంతువులకు ఈ వైరస్ సోకుతుందా లేదా అన్నది ఇంకా పరిశోధనలో తేలలేదు. నెదర్లాండ్ లోనూ ఇలాగే లక్షలాది మింక్ లను కరోనా వైరస్ సోకడంతో చంపేశారు.