Begin typing your search above and press return to search.
ఆ దేశ కోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే.. మెంటలెక్కాల్సిందే
By: Tupaki Desk | 2 Oct 2021 4:32 AM GMTచేసిందే తప్పుడు పని. అలాంటి వాటిని చేసినోళ్లకు ఒంటి మీద వాతలు పడేలా శిక్షలు విధించాల్సింది పోయి.. బాధితులకు దిమ్మ తిరిగిపోయేలా షాకింగ్ వ్యాఖ్యలు చేసిన వైనం సంచలనంగా మారింది. ఇలాంటి చెత్త తీర్పులు ఎక్కడైనా.. ఎవరైనా ఇస్తారా? అయినా.. అసలీ వాదనలో అర్థముందా? మతి ఉండే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? అంటూ ఆగ్రహంతో నిలదీస్తున్నారు.
మీకు తెలీకుండా.. మీ రహస్య భాగాల్ని పబ్లిక్ టాయిలెట్లలో చిత్రీకరించి.. వాటిని ప్రైవేటు వెబ్ సైట్లకు అమ్మేస్తే ఎలా ఉంటుంది. విన్నంతనే ఒంటికి కారం రాసుకున్న భావన కలిగేలా ఉన్న ఈ ఉదంతంపై స్పెయిన్ కోర్టు ఇచ్చిన ఒక తీర్పుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకూ జరిగిందేమంటే.. 2019లో స్పెయిన్ కు వాయువ్య పట్టణమైన కెర్వోలో ‘‘మారుజైనా’’ పేరుతో ఒక ఉత్సవాన్ని నిర్వహించారు.
ఈ వేడుకకు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వేడుకలో పాల్గొన్న వారు కొందరు మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు వారి ముఖాలు.. రహస్య భాగాల్ని వీడియోలుగా చిత్రీకరించి.. వాటిని పోర్న్ సైట్లకు అమ్మేశారు. నిజానికి వేడుక వేళలో.. మూత్ర విసర్జనకు సరైన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదా.. అధికారుల మీదా ఉంది.
అందుకు భిన్నంగా వారి ప్రైవసీకి దెబ్బ తగిలేలా రహస్య కెమెరాలతో షూట్ చేశారు. దీన్ని గుర్తించిన బాధిత మహిళలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు తాజాగా బహిరంగ ప్రదేశాల్లో షూట్ చేయటం వల్ల ఇదేమీ నేరం కాదని పేర్కొనటం షాకింగ్ గా మారింది. ఒకవేళ కోర్టు తీర్పు సరైనదనే అనుకుందాం. పబ్లిక్ ప్లేసుల్లో చిత్రీకరించటం తప్పు కాదన్న కోర్టు.. అలా చిత్రీకరించిన వీడియోలన్ని రహస్యంగా ఎందుకు షూట్ చేశారన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు? బాహాటంగా అందరి ముందు కెమెరాలు పెట్టి షూట్ చేస్తున్నా.. మహిళలు తమ బాత్రూం అవసరాలు తీర్చుకుంటే వేలెత్తి చూపించాలి. అందుకు భిన్నంగా కోర్టు తీర్పుపై పలువురు మండిపడుతున్నారు.