Begin typing your search above and press return to search.
ప్రపంచంలోనే అతి పెద్ద రాకెట్ ప్రయోగం చివరి క్షణంలో ఆగిందెందుకు?
By: Tupaki Desk | 18 April 2023 9:19 AM GMTతన మాటలతో.. చేతలతో తరచూ వార్తల్లో కనిపించే ప్రపంచ సంపన్నుల్లో ఒకడైన ఎలాన్ మస్క్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లక్షల కోట్ల యజమాని అయిన ఆయన.. తనకు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థకు సంబంధించిన ఒక భారీ రాకెట్ ప్రయోగం చివర్లో ఆగటం షాకింగ్ గా మారింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఈ రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లుగా రాకెట్ ప్రయోగం చివరి క్షణంలో ఆపేస్తూ నిర్ణయం తీసుకొన్నారు.
షెడ్యూల్ ప్రకారం ఈ భారీ రాకెట్ ను భారత కాలమానం ప్రకారం సోమవారంసాయంత్రం 6.50 గంటల వేళలో అంతరిక్షంలోకి దూసుకెళ్లాల్సి ఉంది. అయితే.. చివర్లోఈ ప్రయోగాన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవటంగమనార్హం.
అయితే..సాంకేతిక సమస్య అని చెబుతున్నారే తప్పించి ఇంకెలాంటి వివరాల్ని మాత్రంవెల్లడించటం లేదు. ఇక.. ఈ రాకెట్ ప్రత్యేకతలు తెలిస్తే వావ్ అనకుండా ఉండలేరు.
400 అడుగులు పొడవ ఉన్న ఈ భారీ రాకెట్ ను అమెరికాలోని దక్షిణ టెక్సాస్ లోని బోకా చీకా తీరం నుంచి ప్రయోగించాల్సి ఉంది.కానీ.. చివరి క్షణంలో ఈ ప్రయోగాన్ని వాయిదా వేశారు.
ఈ భారీ వ్యోమనౌక దాదాపు 250 టన్నుల బరువు మోసే సత్తాదీని సొంతం. అంతేకాదు.. వంద మందిని అంతరిక్షయానానికి తీసుకెళ్లే సత్తా దాని సొంతం. అంతేకాదు.. ఈ ప్రయోగం మొదలైన కాసేపటికే బూస్టర్ విడిపోయి ఎక్కడ పడాలన్న దానిపై క్లారిటీ ఉంది.
స్పేస్ క్రాఫ్ట్ మాత్రం భూమిచుట్టూ దాదాపు ఒక పరిభ్రమణలో సాగించిన అనంతరం తిరిగి హవాయి సమీపంలో దీన్ని పడేలా ప్రోగ్రాం చేశారు. స్పేస్ క్రాఫ్ట్ మాత్రం భూమి చుట్టూ దాదాపు ఒక పరిభ్రమణం సాగిస్తుంది. ప్రస్తుతం వాయిదా వేసిన ఈ ప్రయోగం మళ్లీ ఎప్పుడు నిర్వహించేదన్న విషయం మీద మాత్రం మళ్లీ ప్రకటన చేస్తామని ఎలాన్ మస్క్ సంస్థ తాజాగా వెల్లడించింది.