Begin typing your search above and press return to search.

మరో చరిత్ర సృష్టించిన నాసా .. క్షేమంగా తిరిగివచ్చిన వ్యోమగాములు !

By:  Tupaki Desk   |   3 Aug 2020 8:30 AM GMT
మరో చరిత్ర సృష్టించిన నాసా .. క్షేమంగా తిరిగివచ్చిన  వ్యోమగాములు !
X
అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికాకు చెందిన నాసా, స్పేస్ ఎక్స్ మరో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ ద్వారా అమెరికాకి చెందిన వ్యోమగాములు డగ్‌ హార్లీ, బాబ్‌ బెంకెన్‌ అంతరిక్షం నుంచి క్షేమంగా భూమికి చేరుకున్నారు. భారత కాలమనం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి 12.18కి ఫ్లోరిడా తీరంలోని సముద్రంలో డ్రాగన్‌ క్యాప్సుల్‌ సురక్షితంగా ల్యాండ్ అయింది. 45 సంవత్సరాల తరువాత నాసా తొలిసారిగా స్ప్లాష్‌ డౌన్‌ ను నిర్వహించింది. అది విజయవంతమైంది. 1975లో అపోలో-సూయోజ్ మిషన్ ద్వారా నాసా తొలిసారిగా స్ప్లాష్ ‌డౌన్ నిర్వహించింది. ఆ తరువాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.

దీనిపై అమెరికా అధినేత ట్రంప్ స్పందించారు. ఇద్దరు వ్యోమగాములు, సురక్షితంగా భూమికి చేరడంపై సంతోషం వ్యక్తం చేశారు. అపోలో కమాండ్‌ మాడ్యుల్‌ అమెరికాలో దిగిన 45ఏళ్ల తర్వాత ఇదే తొలి స్పాష్‌ డౌన్‌ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. అలాగే , స్పేస్‌ ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలన్‌ మస్క్‌ ఆనందం వ్యక్తం చేశారు. 'అంతరిక్షయానం కూడా సాధారణ విమాన ప్రయాణంలాగా మారిపోయినప్పుడు భవిష్యత్‌ లో మానవాళి మనుగడకు భద్రత దొరికనట్లే' అంటూ ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. నాసా మాములుగా అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చే క్యాప్సుల్స్‌ భూ ఉపరితలంపై ల్యాండింగ్ చేస్తుంటుంది . కజకి‌స్థాన్‌ లోని ఎడారి ప్రాంతాల్లో ల్యాండింగ్ చేస్తుంటుంది. అయితే , దీనికి కాస్తా భిన్నంగా వాటర్ ల్యాండింగ్ ‌కు సిద్ధమైంది. ఓ ప్రైవేటు క్యాప్సుల్‌ ద్వారా తన వ్యొమగాములను భూమికి తీసుకుని రావడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. గత మే 30 న వీరితో కూడిన అంతరిక్ష నౌక ఆకాశంలోకి ఎగిరింది.