Begin typing your search above and press return to search.

రియాల్టీ షో విజేతకు ఊహించని బహుమతి

By:  Tupaki Desk   |   22 Sep 2020 5:00 AM GMT
రియాల్టీ షో విజేతకు ఊహించని బహుమతి
X
ఎంటరట్మైంట్ చానల్ అన్నంతనే అయితే సీరియల్ లేదంటే కామెడీ షో కాదంటూ రియాల్టీ షో. కాసింత బడ్జెట్ ఎక్కువైనా.. రియాల్టీ షోకు ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. అందుకే.. వీలైనంతవరకు అన్ని చానళ్లు ఏదోలా రియాల్టీ షోను టెలికాస్ట్ చేయటానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక.. షోలో పాల్గొనే వారికి పరీక్షల మీద పరీక్షలు పెట్టి విజేతగా తేల్చి.. భారీ నగదు బహుమతిని.. ఖరీదైన కార్లను ఇచ్చేస్తుంటారు.

రోటీన్ కు భిన్నంగా తాజాగా ఒక రియాల్టీ షో నిర్వాహకులు ఊహించని బహుమతిని ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. స్పేస్ హీరో ఇన్ కార్పొరేషన్ అనే అమెరికాకు చెందిన ప్రొడక్షన్ కంపెనీ త్వరలో ఒక రియాల్టీ షో కు ప్లాన్ చేసింది. ఈ షో ఎలా ఉంటుంది? ఎలాంటి పోటీలు పెడతారనే విషయాల్ని ఆ సంస్థ వెల్లడించలేదు. అయితే.. ఈ షోలో విజేతగా నిలిచిన వారిని ఏకంగా అంతరిక్ష యాత్రకు పంపనున్నట్లుగా పేర్కొని.. ఆ షో మీద బోలెడంత బజ్ క్రియేట్ అయ్యేలా చేశారు.

అయితే.. ఈ షో ఎలా ఉంటుందన్న విషయం మీద వివరాలు వెల్లడించనప్పటికీ.. పలు ఊహాగానాలు సాగుతున్నాయి. దీని ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్ష యాత్రపై ఆసక్తి ఉన్న అభ్యర్థుల్ని ఒక చోటకు చేర్చి.. అంతరిక్ష కేంద్రంలో ఉండగలరా? లేదా? అన్న అంశంపై శారీరక.. మానసిక పరీక్షల్ని నిర్వహిస్తారట. ప్రేక్షకులు వేసే ఓట్ల ఆధారంగా విజేతగా ప్రకటిస్తారు. సదరు విజేతను ప్రైజ్ మనీలో భాగంగా సదూరన ఉన్న అంతరిక్ష కేంద్రానికి అతిధిగా పంపనున్నారు.

అక్కడ పది రోజులు ఉండే అవకాశాన్ని కల్పించనున్నారు. దీనికి సంబంధించిన ఒప్పందాన్ని ప్రైవేటు స్పేస్ మిషన్ సంస్త యాక్సివోమ్ స్పేస్ అనే సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అంతేకాదు.. త్వరలో నాసాను సంప్రదించి.. వారికి తమ రియాల్టీ షో గురించి తెలియజేసిన తర్వాతనే.. ప్రేక్షకులకు ఈ షోకు సంబంధించిన వివరాల్ని ప్రకటిస్తారని చెబుతున్నారు. ఊహించని రీతిలో ప్రకటించిన విజేతకు ఇచ్చే బహుమతితో ఈ షో వివరాలు అంతర్జాతీయ మీడియాలో కవర్ అయ్యేలా చేశాయి. ఇప్పుడీ షో మీద బోలెడంత ఆసక్తి నెలకొంది.