Begin typing your search above and press return to search.
రిపబ్లిక్ వేడుకలకు సైకిల్ పై తెలుగు ఎస్పీ
By: Tupaki Desk | 27 Jan 2016 10:30 AM ISTతనదైన శైలిలో వ్యవహరిస్తూ.. నిజాయితీగా ఉంటారన్న పేరున్న పోలీసు ఉన్నతాధికారి ఆకే రవికృష్ణ. చిన్నస్థాయి నుంచి స్వయంకృషితో ఎదిగిన రవికృష్ణ వ్యవహారశైలి కాస్త భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం ఆయన కర్నూలుజిల్లాకు ఎస్పీగా వ్యవహరిస్తున్నారు.
నిజానికి.. ఒక జిల్లా ఎస్పీ అంటే ఆ హడావుడే వేరు. కానీ.. అలాంటి వాటికి రవికృష్ణ దూరంగా ఉండటంతో పాటు.. సాదాసీదాగా ఉంటూ ప్రజలతో మమేకం అయ్యేందుకు ఆయన ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. తనకు తానుగా పలు అంశాలపై ప్రచారం నిర్వహిస్తూ వార్తల్లోకి వస్తుంటారు. తాజాగా రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యేందుకు ఎస్పీ తన కాన్వాయ్ ను వదిలేసి.. సింఫుల్ గా సైకిల్ మీద హాజరు కావటం పలువురిని విశేషంగా ఆకట్టుకుంది.
అట్టహాసాన్ని వదిలేసి.. సింఫుల్ గా సైకిల్ మీద ఎక్కిన ఈ జిల్లా పోలీస్ బాస్ యూనిఫారంలో సైకిల్ ఎక్కి.. రిపబ్లిక్ డే ఫంక్షన్ కు హాజరైన తీరు కర్నూలు నగర ప్రజల్ని అమితంగా ఆకట్టుకుంది. సింఫుల్ గా ఉండే ఇలాంటి అధికారిని ఎవరు మాత్రం అభినందించకుండా ఉండగలరు?