Begin typing your search above and press return to search.
ఫ్యూచర్ ను కళ్లకు కట్టినట్లుగా కీలక వ్యాఖ్య చేసిన సౌమ్యా స్వామినాథన్
By: Tupaki Desk | 18 May 2021 3:48 AM GMTభవిష్యత్తు ఎలా ఉంటుంది? చిన్నా..పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ జరగబోయే కాలం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి.. ఉత్సుకత ఎక్కువగా కనిపిస్తుంటుంది. కరోనా కష్టకాలంలో రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయన్న విషయం ఎన్నో అంశాల మీద ఆధారపడి ఉంటుంది. మొదటి వేవ్ ను ఎదుర్కొమన్న ఆత్మవిశ్వాసం.. ఓవర్ కాన్ఫిడెన్సుగా మారటం.. సెకండ్ వేవ్ దేశానికి ఎలాంటి సినిమా చూపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో మరే దేశంలో లేని రీతిలో భారీగా కేసులు నమోదు కావటమే కాదు.. అత్యవసర వైద్యం కోసం పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. మరి.. ఇలాంటి పరిస్థితి మరెంతకాలం? కనిపించని వైరస్ నుంచి రక్షణ ఎలా? ఈ విపత్తు నుంచి బయటపడేదెలా? అన్న ప్రశ్నలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
కరోనా నియంత్రణకు మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. వ్యాక్సినేషన్ కు మించింది లేదనే చెప్పాలి. దేశీయంగా టీకాలు ఉత్పత్తి అవుతున్నా.. వాటిని దేశ ప్రజల కంటే కూడా.. విదేశాలకు ఎగుమతి చేయటం మీద మోడీ సర్కారు ప్రదర్శించిన ప్రాధాన్యత దేశానికి ఎలాంటి పరిస్థితిని తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండా పోయింది. రానున్న ఆరు నుంచి పద్దెనిమిది నెలల కాలంలో వ్యాక్సినేషన్ విషయంలో దేశం అనుసరించే విధానం ఆధారంగానే కరోనా భవిష్యత్తు ఉంటుందన్న మాట వినిపిస్తోంది.
ఇప్పుడు వేసుకుంటున్న లెక్కల ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా 30 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మొత్తం టీకా కార్యక్రమం మీదనే ప్రపంచం ఫోకస్ ఉంటుంది. అంటే.. క్యాలెండర్ లో 2021 మాత్రమే కాదు 2022 కూడా కరోనా ఖాతాలో వేయాల్సినట్లేనన్న మాట. వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోవటం ద్వారా.. కరోనా వైరస్ వ్యాప్తికి ఎక్కడో ఒక దగ్గర అంతం ఉంటుందన్న మాట ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్టుగా వ్యవహరిస్తున్న సౌమ్యా స్వామినాథన్ పేర్కొన్నారు.
వేరియంట్ ఏదైనా.. దానికి వ్యాప్తి చెందే లక్షణం ఉంటుందని చెబుతున్న ఆమె.. భారత్ లో కనిపిస్తున్న కరోనాకు చెందిన బి1.617 వేరియంట్ ఎక్కువగా సంక్రమణ చెందటానికి అవకాశం ఉందని చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం ఈ వేరియంట్ యాభై దేశాల్లో విస్తరించి ఉందని చెప్పారు. ఇదంతా చూస్తే.. వచ్చే ఏడాది కాలాన్ని కరోనాకు అర్పించటం మినహా మరింకేమీ ఉండదని చెప్పక తప్పదు. సో.. వైరస్ మీద పోరాటంలోనే 2022 కూడా ముగిసిపోతుందన్నమాట.