Begin typing your search above and press return to search.
స్టాలిన్ వార్నింగ్.. రైల్వేశాఖ వెనక్కి తగ్గింది!
By: Tupaki Desk | 15 Jun 2019 4:47 AM GMTమాతృభాషపై తెలుగోళ్లలో లేనిది.. కన్నడ.. తమిళులకు ఉన్నది మాతృభాషాభిమానం. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా తమ మాతృభాష మీద దాడి జరుగుతుందంటే ఏ మాత్రం ఒప్పుకోరు కదా.. ఎంకైనా రెడీ.. దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఇదే వారి మాతృభాషకు శ్రీరామరక్షగా మారిందని చెప్పాలి.
తాజాగా రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం ఒకటి వివాదాస్పదంగా మారింది. దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది తమ ఉత్తరప్రత్యుత్తరాల్ని తమిళంలో కాకుండా హిందీ.. ఇంగ్లిషులోనే చేయాలని డిసైడ్ చేశారు. ఈ విషయం స్టాలిన్ వరకూ వెళ్లింది. దీంతో.. తీవ్ర ఆగ్రహానికి వ్యక్తం చేసిన ఆయన.. రైల్వే అధికారులకు తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. మాతృభాషను వదిలేసి.. హిందీని రుద్దాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
తమిళనాడులో హిందీ ప్రాధాన్యతను పెంచేందుకు ప్రయత్నిస్తున్న తీరును తప్పు పట్టటమే కాదు.. ప్రయాణికులంతా స్టేషన్ మాష్టర్లు.. సిబ్బందితో మాట్లాడాలంటే హిందీ.. ఇంగ్లిషును ప్రత్యేకంగా నేర్చుకోవాలా? అంటూ అధికారుల్ని ప్రశ్నించారు. ఇలాంటి అనవసరమైన ఉత్తర్వులు జారీ చేయొద్దని ఆయన కఠినంగా రియాక్ట్ అయ్యారు.
స్టాలిన్ హెచ్చరికల నేపథ్యంలో రైల్వే ఉన్నతాధికారులు ఈ విషయంపై వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. తాము జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటూ.. గతంలో మాదిరే నిబంధనల్ని కొనసాగించాలని నిర్ణయించటం గమనార్హం.