Begin typing your search above and press return to search.

నిరీక్షణకు శుభం కార్డు.. 48 గంటల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు

By:  Tupaki Desk   |   7 Jun 2023 10:00 PM GMT
నిరీక్షణకు శుభం కార్డు.. 48 గంటల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు
X
ఎన్నాళ్లకు గుర్తుచానా వానా.. అంటూ అందరూ పాడుకునే పరిస్థితి. ఈసారి వేసవి గతంకంటే కాస్తంత చల్లగా ఉంటుందని భావించినా.. మే లో పుట్టించిన మంట తో ప్రజలు ఎంతలా ఉక్కిరి బిక్కిరి అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మే వెళ్లిపోయి.. జూన్ వచ్చి ఆరు రోజులు అవుతున్నా మండే ఎండల తో మంటెత్తిపోతున్న పరిస్థితి. మరో వైపు.. మే చివర కు కేరళ కు రావాల్సిన నైరుతి రుతుపవనాలు ఇంకా రాకపోవటం తో అందరూ నైరుతి కోసం ఎదురుచూసే పరిస్థితి.

ఇలాంటి వేళ.. సుదీర్ఘ నిరీక్షణ కు తెర దించుతూ వాతావరణ శాఖ తాజాగా చల్లటి కబురు చెప్పేసింది. మరో 48 గంటల్లో అంటే.. రెండు రోజుల వ్యవధి లో కేరళ కు నైరుతి రుతు పవనాలు వచ్చేస్తున్నట్లుగా ప్రకటించింది. తాజాగా ఆగ్నేయ అరేబియా లో ఏర్పడిన 'బిపోర్ జాయ్' తుపా ను కారణంగా రుతుపవనాలు లేట్ అయ్యే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి.

అయితే.. ఈ సందేహాల కు చెక్ చెబుతూ భారత వాతావరణ సంస్థ స్పందించింది. మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని.. రుతుపవనాల రాక కు దక్షిణ ఆరేబియా సముద్రం.. లక్షద్వీప్.. వాయువ్య.. ఈశాన్య బంగాళాఖాతం లో వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు వెల్లడించింది. గత ఏడాది జూన్ 1న కేరళ కు నైరుతి రుతుపవనాలు తాకితే.. తాజా గా ఏడో తారీఖు వచ్చినా కూడా రుతుపవనాల జాడ కనిపించని పరిస్థితి. ఇలాంటి వేళ.. చల్లటి కబురు వచ్చింది.

ఈసారి రుతుపవనాలు లేట్ కావటం కారణంగా తక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉందంటున్నారు. అరేబియా సముద్రంలో ఏర్పడి బిపోర్ జాయ్ తుపాన్ బలపడి.. తీవ్ర తుపాను గా మారినప్పటికి అరేబియా తీర ప్రాంతానికి ఎలాంటి ముప్పు లేదంటున్నారు. కాకుంటే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జాలర్లను సముద్రం లోకి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఈ తుపా ను బుధవారం ఉదయాని కి గోవా కు 890 కి.మీ., ముంబయికి వెయ్యి కి.మీ., పోర్ బందర్ కు 1070కి.మీ, కరాచీకి 1370కి.మీ. దూరంలో కేంద్రీ క్రతమైనట్లు గా చెబుతున్నారు.