Begin typing your search above and press return to search.
ఇక తోడటానికి కూడా ఏమీ మిగలదా..బంగారానికి చంద్రమండలమే దిక్కా!
By: Tupaki Desk | 26 Sep 2020 12:30 AM GMTకరోనా వచ్చాక బంగారం ధరలు ఎన్నడూ లేని గరిష్ఠంగా పెరిగాయి. వ్యాపారవేత్తలు, ముదుపర్లు పెట్టుబడికి బంగారం సేఫ్ అని భావించడమే ఇందుకు కారణం. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2000 డాలర్లకు (సుమారు 1,47, 658 రూపాయిలు) వరకు చేరింది. అయితే ప్రపంచవ్యాప్తగా బంగారం ఎంత అందుబాటులో ఉంది. ఏ మేర ఈ లోహం నిల్వ ఉంది.. అన్న విషయంపై పలు అంచనాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం భూమిపైన బంగారం నిల్వలన్నీ అంతరించిపోయి పరిస్థితి ఉన్నదని నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇటీవల కాలంలో బంగారం వినియోగం పెరిగిపోయిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంటోంది. 2019లో దాదాపు 3,531 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. ఇది 2018 కంటే 1 శాతం తక్కువ. 2008 నుంచి పరిశీలించి చూస్తే ఉత్పత్తిలో తగ్గుదల కనిపించడం ఇదే తొలిసారి. అయితే ప్రస్తుతం బంగారం నిధులు తగ్గిపోవడంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రతినిధి హన్నా బ్రాండ్స్‌టాటర్ చెప్పారు. ఇప్పటికే 1,90,000 టన్నుల బంగారాన్ని తవ్వి తీసినట్టు నిపుణులు చెబుతున్నారు. ఇంకా 50,000 టన్నుల వరకు మాత్రమే బంగారం ఉండొచ్చని అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. ఈ సర్వే ప్రకారం.. ఇంకా 20 శాతం నిల్వలు మాత్రమే ఉన్నాయి.
దక్షిణాఫ్రికాలోనే అత్యధిక బంగారం నిల్వలు
దక్షిణాఫ్రికాలో విట్‌వాటర్ శాండ్ బేసిన్ లో అత్యధిక బంగారం నిలువలున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు తవ్వి తీసిన బంగారంలో 30 శాతం ఇక్కడిదే. ఇది కాకుండా, దక్షిణాఫ్రికాలో ఉన్న పొనెంగ్ గని, ఆస్ట్రేలియాలో సూపర్ పిట్, న్యూ మోంట్ బాడింగ్టన్ గనులు, ఇండోనేషియాలో గ్రాస్బెర్గ్, అమెరికాలో నెవాడ కూడా బంగారు గనులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు. అయితే భూమిమీద ఉన్న బంగారం నిల్వలన్నీ తగ్గిపోతే ఇక చంద్రమండలం మీదే అన్వేషించాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. చంద్రమండలంలోని పలుచోట్ల ఇప్పటికే బంగారాన్ని గుర్తించారు.