Begin typing your search above and press return to search.

ఐపీఎల్​ కు ఇంత ఆదరణ నమ్మలేకపోయా : గంగూలీ కామెంట్స్​

By:  Tupaki Desk   |   29 Oct 2020 11:50 AM GMT
ఐపీఎల్​ కు ఇంత ఆదరణ నమ్మలేకపోయా : గంగూలీ కామెంట్స్​
X
చైనాలో గత నవంబర్ లో కరోనా ప్రబలగా.. ఈ ఏడాది మార్చిలో మహమ్మారి మనదేశాన్ని తాకింది. దీంతో అప్పటికే వరుస షెడ్యూళ్లతో తీరిక లేకుండా టీమిండియా మ్యాచ్ లు ఆడుతుండగా అన్ని మ్యాచ్ లను నిలిపివేశారు. ప్రపంచంలో అన్ని దేశాలు క్రికెట్ మ్యాచ్ ల నిర్వహణను నిలిపివేశాయి. ఈ ఏడాది టీ 20 వరల్డ్ కప్ జరగాల్సి ఉండగా కరోనా వైరస్ విజృంభణను దృష్టిలో పెట్టుకొని ఆ టోర్నీని ఐసీసీ వాయిదా వేసింది. ఇక మన దేశంలో ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపీఎల్ నిర్వహణ కూడా కష్టమని అంతా భావించారు. అప్పటికే నిర్వహించాల్సిన షెడ్యూలు కూడా ముగిసిపోయింది.

యూఏఈలో కరోనా కేసులు తక్కువగా ఉండడంతో అక్కడ జనం లేకుండా ఐపీఎల్ టోర్నమెంట్ నిర్వహించడానికి బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్
ల నిర్వహణ కోసం జట్ల నిర్వాహకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఆటగాళ్లను ముందుగానే యూఏఈ పంపి క్వారంటైన్ లో ఉంచి కరోనా నిర్ధారణ టెస్టులు కూడా నిర్వహించారు. ఆ తర్వాత ఆటగాళ్ళందరినీ బయో బబుల్ లో ఉంచి ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపించకుండా మ్యాచ్ లను నిర్వహిస్తున్నారు. అయితే స్టేడియంలో జనం లేని మ్యాచులకు ఆదరణ ఉండదేమో అని అందరూ భావించగా.. ఈ ఏడాది అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఐపీఎల్ ను అభిమానులు మునుపటి కంటే ఎక్కువగా ఆదరిస్తున్నారు. టీవీలో మ్యాచ్ లు ప్రసారం అవుతున్న సమయంలో వీక్షణలు కూడా పెద్ద సంఖ్యలో పెరిగాయి.

తాజాగా ఐపీఎల్​పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ స్పందించారు. ‘ప్రేక్షకులు ఐపీఎల్​ను ఇంతలా ఆదరించడం నమ్మలేకపోతున్నా.. అందరి జీవితాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ఐపీఎల్ నిర్వహించాం. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ టోర్నమెంట్​. ఈ సారి చాలా సూపర్​ ఓవర్లు జరిగాయి. మ్యాచ్ లు ఇంటరెస్టింగ్ గా సాగాయి. ఎంతోమంది కుర్రాళ్ల ప్రతిభ వెలుగులోకి వచ్చింది. మొదటివారం మ్యాచ్​లను 26.9 కోట్ల మంది వీక్షించారు’ అని గంగూలి పేర్కొన్నారు. ఐపీఎల్​ కు ప్రేక్షకుల నుంచి ఎంతో ఆదరణ వచ్చిందని చెప్పారు.