Begin typing your search above and press return to search.

సీఏఏలో ఏముందో కూడా ఆయనకు తెలియదంట?

By:  Tupaki Desk   |   21 Dec 2019 7:43 AM GMT
సీఏఏలో ఏముందో కూడా ఆయనకు తెలియదంట?
X
గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ చట్టం పై కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. దీనిపై ఇప్పటికే చాలామంది తమ అభిప్రాయాలని చెప్పారు. తాజాగా ఆ లిస్ట్ లో మాజీ టీం ఇండియా కెప్టెన్ .. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తాజాగా స్పందించాడు. తను సీఏఏకు సంబంధించిన బిల్లు పూర్తిగా చదవలేదని.. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరూ సంయమనం పాటించాలని విఙ్ఞప్తి చేశాడు.

ఈ మధ్య సీఏఏను వ్యతిరేకిస్తూ సోషల్‌ మీడియాలో సందేశాన్ని పోస్ట్‌ చేసిందంటూ వార్తలు ప్రచారమయ్యాయి. దీనితో ఆమె పై ట్రోల్స్‌ బారిన పడింది. అయితే ఆ పోస్టు నిజం కాదని, సనా చిన్నపిల్ల కాబట్టి తనను రాజకీయాల్లోకి లాగొద్దని గంగూలీ ట్వీట్‌ చేసి - ఆ వివాదాన్ని అక్కడితో ఆపేసాడు. ఈ క్రమంలో సీసీఏపై అభిప్రాయాన్ని చెప్పకుండా గంగూలీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నెటిజన్లు ఆయనను ప్రశ్నించారు.

దీనితో తాజాగా ఓ జాతీయ మీడియాతో గంగూలీ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు శాంతి కలిగి ఉండాలని కోరుకుంటున్నా. రాజకీయాల గురించి నేను మాట్లాడదలచుకోలేదు. నిజానికి పౌరసత్వ సవరణ బిల్లును నేను చదవలేదు. కాబట్టి పూర్తి అవగాహన లేకుండా ఆ విషయం గురించి మాట్లాడటం సరికాదు. అయితే అందరూ ప్రశాంతంగా ఉండాలి. ఈ చట్టంతో ఎవరికి ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి, ఎవరు నష్టపోతారు అనే విషయాల గురించి చర్చ జరగాలి. అయితే నాకు ప్రతీ ఒక్కరి సంతోషమే ముఖ్యం అని తెలిపారు.