Begin typing your search above and press return to search.
గుండెలు అదిరే మాటను వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్
By: Tupaki Desk | 22 Dec 2020 5:15 AM GMTచావు కబురు చల్లగా చెప్పటం అంటే ఏమిటో అర్థమయ్యేలా చేస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కరోనా ఎపిసోడ్ లో అట్టర్ ప్లాప్ అయిన ప్రపంచఆరోగ్య సంస్థ.. బ్రిటన్ లో వెలుగు చూసిన కొత్త వైరస్ విషయాన్ని అప్రమత్తం చేయటంలోనూ తప్పులోకాలేసిందా? అంటే అవుననే చెప్పాలి. తాజాగా ఆ సంస్థకు చెందిన చీఫ్ సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ దడ పుట్టే మాటను చెప్పుకొచ్చారు.
బ్రిటన్ లో వేగంగా విస్తరిస్తూ.. ప్రపంచ దేశాల్నివణికిస్తున్న ఈ కొత్త స్ట్రెయిన్ ను సెప్టెంబరులోనే బ్రిటన్ లో గుర్తించినట్లు ఆమె చెప్పారు. ఇప్పటికే ఈ కొత్త వైరస్ ప్రపంచంలోని పలు దేశాలకు విస్తరించి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ స్ట్రెయిన్ 70 వాతం వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లుగా ప్రాథమిక డేటా స్పష్టం చేస్తుందని చెప్పారు.
ఇప్పటికే డెవలప్ చేసిన వ్యాక్సిన్ తాజా మార్పులు చెందిన వైరస్ మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు. మొత్తంజీనోమ్ సీక్వెన్సింగ్ ను విశ్లేషించే సామర్థ్యం ఉన్న దేశాల్లో బ్రిటన్ ఒకటి. అందువల్ల తక్కువ సమయంలోనే దీన్ని చాలా దగ్గరగా ట్రాక్ చేయగలరని ఆశిస్తున్నారు. మిగిలిన దేశాలు ఈ జన్యు వైవిధ్యాన్ని ఇప్పటికే కనుగొని ఉంటారని ఆమె చెబుతున్నారు. ఇటలీలోనూ ఒక వ్యక్తిలోఈ కొత్త స్ట్రెయిన్ ను తాము గుర్తించినట్లుగా బ్రిటన్ వెల్లడించింది.
ఆస్ట్రేలియా.. డెన్మార్క్.. నెదర్లాండ్స్ తో పాటు దక్షిణాఫ్రికాలో కూడా ఈ కొత్త వైరస్ దూకుడుగా దూసుకెళుతుందని చెబుతున్నారు. ప్రస్తుతానికి తాము జన్యు శ్రేణిని విశ్లేషించాలని తాము కోరుతున్నట్లుగా ఆమె చెప్పారు. మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ చేసే సామర్థ్యం భారత్ కు ఉందని.. ప్రపంచ డేటాలోని దాదాపు 3 లక్షల సీక్వెన్స్ లు భారత్ కు ఇప్పటికే అందాయని.. ఇవన్నీ కూడా భారత్ కు ఉపయోగపడతాయని చెబుతున్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో కరోనా విషయంలో ముందుగా ఏమేం చేశామో.. అవన్నీ చేయాల్సి ఉంటుంది. టెస్టింగ్.. కాంటాక్టు ట్రేసింగ్.. పాజిటివ్ వచ్చినోళ్లను ప్రత్యేకంగా ఐసోలేషన్ కు తరలించాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే.. బ్రిటన్ పుణ్యమా అని వైరస్ కథ మళ్లీ వెనక్కి వచ్చినట్లే అన్న భావన క లగక మానదు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. వ్యక్తిగతంగా ఎవరికి వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైనట్లే.