Begin typing your search above and press return to search.

ఉరికి ఒక రాజధాని కావాలేమో?

By:  Tupaki Desk   |   30 Jan 2020 9:12 AM GMT
ఉరికి ఒక రాజధాని కావాలేమో?
X
ఏపీకి 3 రాజధానుల మంట ఇంకా చల్లారడం.. దాని పర్యవసనాలు ఎంత వరకూ వెళ్లాయంటే ఏకంగా బిల్లును అడ్డుకుంటున్న శాసనమండలినే రద్దు చేసే వరకూ రాజకీయం సాగింది. అంత పట్టుదలగా జగన్ సర్కారు ముందుకెళ్తున్నా ఇంకా 3 రాజధానుల ఏర్పాటుకు ఎన్నో అవరోధాలు ఏర్పడుతూనే ఉన్నాయి.

అయితే ఏపీకి 3 రాజధానులే దిక్కులేవురా అయ్యా అంటే ఈ రాష్ట్రం ఏకంగా ఉన్న రాజధానితోపాటు మరో 4 ఉప రాజధానులను ఏర్పాటు చేయాలని డిసైడ్ కావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఉమ్మడి ఏపీలో ఎలాగైతే తెలంగాణ వారు తమకు నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరుగుతోందని.. ఆంధ్రోళ్లు దోచేస్తున్నారని విడి పోయారో.. అలానే బీహార్ నుంచి ఆదివాసులు, గిరిజనులు ఉన్న జార్ఖండ్ రాష్ట్రం 2000 సంవత్సరంలో విడిపోయింది.అయితే బీహార్ తో పోల్చితే 20 ఏళ్లలో అభివృద్ధిలో చాలా వెనుకబడింది.

తాజాగా గద్దెనెక్కిన సీఎం హేమంత్ సోరన్.. జార్ఖండ్ లో వెనుక బాటుకు గురైన ప్రాంతాలకు న్యాయం చేయడానికి.. భవిష్యత్తులో వేర్పాటువాద ఉద్యమాలు రాకుండా చేయడానికి అక్కడి ఒక్కో ప్రాంతానికి ఒక్కో రాజధాని ని ఏర్పాటు చేయాలని ప్రతి పాదనను తెరపైకి తెచ్చారు. దుంకా పట్టణంతోపాటు మేథిని నగర్, చైభాస, గిరిద్ పట్టణాలను ఉప రాజధానులుగా ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

దేశంలోనే గిరిజనులు ఎక్కువ గా ఉన్న రాష్ట్రం జార్ఖండ్. అక్కడ అపార ఖనిజ నిల్వలు ఉన్నా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ప్రజలు అభివృద్ధిలో వెనుకబడ్డారు. ఉమ్మడి ఏపీ లో రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర తరహాలోనే జార్ఖండ్ లో కోల్హాన్, పొలాము, నార్త్ చోటా నాగపూర్ ప్రాంతాలున్నాయి. వీటికి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో ఉప రాజధానులను ఏర్పాటు చేయాలని సీఎం హేమంత్ సోరన్ నిర్ణయించారు. తద్వారా పరిశ్రమలు ఏర్పడి అభివృద్ధి సాధ్యమవుతుందని స్కెచ్ గీశారు.