Begin typing your search above and press return to search.

త్వరలో దేశ వ్యాప్తంగా మిషన్‌ భగీరథ !

By:  Tupaki Desk   |   12 Nov 2019 8:37 AM GMT
త్వరలో దేశ వ్యాప్తంగా మిషన్‌ భగీరథ !
X
తెలంగాణ లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ప్రభుత్వం తీసుకున్న అతి ముఖ్య మైన నిర్ణయాల లో మొదటిది మిషన్‌ భగీరథ , మిషన్ కాకతీయ. మిషన్‌ భగీరథ ద్వారా తెలంగాణ లోని ప్రతి ఇంటి కి సురక్షితమైన త్రాగు నీటిని అందించాలనే లక్ష్యం తో సీఎం కేసీఆర్ ఈ మహా ప్రాజెక్ట్స్ ని ప్రారంభించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రం లో ప్రతి ఇంటికీ రోజూ సురక్షిత మంచి నీరు అందించినట్లే అని , ఈ పథకాన్ని దేశవ్యాప్తం గా అమలు చేసే ఆలోచన కేంద్రానికి ఉన్నదని కేంద్ర జలశక్తి శాఖమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ప్రకటించారు.

సోమవారం ప్రగతి భవన్‌ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో కేంద్ర మంత్రి షెకావత్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర మంత్రికి వివరించారు. దీనిపై షెకావత్‌ ప్రజల కి మంచినీటి సౌకర్యం కల్పించడం ప్రభుత్వాల కనీస కర్తవ్యమని తెలిపారు. ఆయా రాష్ట్రాల భాగ స్వామ్యం తో మంచినీటి పథకాలు అమలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భం గా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 24 వేల ఆవాస ప్రాంతాల కు నిత్యం ఉపరి తల జలాల ను మంచి నీరుగా అందించేందుకు మిషన్ భగీరథ పథకం చేపట్టాం. తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల మంచినీటికి తీవ్రమైన ఎద్దడి ఉంది. చాలా చోట్ల ఫ్లోరైడ్ సమస్య ఉంది. కొన్ని ప్రాంతాల్లో అసలు తాగు నీళ్లే దొరకని పరిస్థితి. దొరికిన నీళ్లు కూడా శుభ్రం గా ఉండక పోవడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. అందుకే గోదావరి, కృష్ణా జలాలను శుద్ది చేసి రోజూ ప్రజలకు అందివ్వడానికి ఈ కార్యక్రమం తీసుకున్నాం అని కేంద్ర మంత్రి కి సీఎం కేసీఆర్ వివరించారు.

అలాగే రాబోయే 30 ఏళ్ల వరకు పెరిగే జనాభాను కూడా అంచనా వేసుకుని.. నాటి అవసరాలు కూడా తీర్చే విధం గా మిషన్ భగీరథ ప్రాజెక్టును డిజైన్ చేసినట్లు సీఎం కేసీఆర్ వివరించారు. ఇలాంటి పథకం దేశమంతా అమలైతే మంచిదన్నారు. ప్రజలకు మంచినీరు అందించడానికి చేసే కార్య క్రమాలను ఆర్థిక కోణంలో చూడవద్దని అని కోరారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలను ప్రశంసించిన కేంద్ర మంత్రి, తాను త్వరలో నే మరోసారి తెలంగాణ లో పర్యటించి క్షేత్ర స్థాయి లో ఈ పథకాల అమలును స్వయం గా చూస్తానని తెలిపారు.