Begin typing your search above and press return to search.

బ్రిట్నీ స్పియ‌ర్స్ చ‌చ్చిపోయింది..కాదు కాదు

By:  Tupaki Desk   |   28 Dec 2016 2:59 PM GMT
బ్రిట్నీ స్పియ‌ర్స్ చ‌చ్చిపోయింది..కాదు కాదు
X
ప్రస్తుతం సోషల్ మీడియాకి ఉన్న క్రేజ్ మరే దానికి లేదనే చెప్పాలి. సామాజిక మాధ్య‌మాల కారణంగా ఎన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయో.. అంతే స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నవి లేనివి కూడా క్రియేట్ చేసి అందులో పోస్ట్ చేయడంతో వారికి కంటిపై కునుకు లేకుండా పోతుంది. ఆ మధ్య బ్రతికున్న వేణుమాధవ్ ని చనిపోయినట్టు వార్తలు సృష్టించి హడావిడి చేశారు. మొన్నటికి మొన్న అందాల తార ఐశ్వర్యరాయ్ కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకుందనే పుకార్లు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. దీనిపై ఐష్ కుటుంబ సభ్యలు ఎవరు స్పందించకపోయిన, అది రూమరని తేలిపోయింది. ఇక తాజాగా ప్రముఖ పాప్ సాంగర్ బ్రిట్ని స్పియర్ యాక్సిడెంట్ లో చనిపోయిందంటూ ప్రఖ్యాత మ్యూజిక్‌ కంపెనీ సోనీ తమ అధికార ట్విటర్‌ పేజీలో పోస్ట్ పెట్టింది.

బ్రిట్నీ స్పియ‌ర్స్ గురించి పోస్ట్ చేసిన సోనీ... "త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాము.. ఆర్ ఐపీ బ్రిట్నీ" అనే ట్వీట్ పెట్టేసరికి అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆరాతీయ‌డం మొద‌లుపెట్టేస‌రికి అసలు విష‌యం తెలియ‌లేదు. బ్రిట్నీ స్పియర్స్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఆమె సురక్షితంగా ఉన్నట్టు బ్రిట్నీ మేనేజర్ పేర్కొన్నాడు. అయితే సోనీ మ్యూజిక్‌ గ్లోబల్‌ ట్విటర్ ని ఎవరో హ్యక్ చేసి ఇలా పోస్ట్ పెట్టి ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిపై స్పందించిన సోని సంస్థ ప్రతినిధులు క్షమాపణలు తెలిపారు . ప్రస్తుతం వారి ట్విట్టర్ నుండి కూడా ఆ పోస్ట్ ని తొలగించారు. మరి అసలు ఇలా జరగడానికి కారణమేంటి అనేది తెలియాల్సి ఉంది..


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/