Begin typing your search above and press return to search.

సోనుసూద్ విత‌ర‌ణ.. కొత్త‌ టార్గెట్ ఫిక్సైంది!

By:  Tupaki Desk   |   19 Feb 2023 8:00 PM GMT
సోనుసూద్ విత‌ర‌ణ.. కొత్త‌ టార్గెట్ ఫిక్సైంది!
X
బాలీవుడ్ న‌టుడు సోనుసూద్ సేవా కార్య‌క్ర‌మాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న ఎంత‌టి సేవా దృక్ఫ‌థం గ‌ల వారో కోవిడ్ స‌మ‌యంలో బ‌య‌ట ప‌డింది.  అప్ప‌టి నుంచి ఆయ‌న సేవ‌లు నిరంత‌రంగా కొన‌సాగుతున్నాయి. డే బై డే వాటిని మ‌రింత విస్త‌రించుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ క్ర‌మంలో రాజ‌కీయంగా కొన్ని ర‌కాల విమ‌ర్శ‌లు ఎదుర్కున్నారు. మంచి చేసినా రాజ‌కీయం జ‌రుగుతుంద‌ని తొలిసారి సోనుసూద్ సేవా కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌జ‌ల‌కి అర్ధ‌మైంది. అయినా వేటికి వెర‌వ‌లేదు.

ఎలాంటి దుష్ట శ‌క్తులు ఎదురైనా సోనుసూద్ అన్నింటిని అధిగ‌మించి నిర్విరామంగా త‌న సేవా కార్య‌క్ర‌మాలు కొన‌సాగిస్తున్నారు.  తాజాగా ఆయ‌న కొత్త టార్గెట కూడా ఫిక్సైంది.  ప్ర‌తి రాష్టంలో వృద్ధా శ్ర‌మం ఏర్పాటు చేయ‌డం..ఉచిత పాఠశాల ఏర్పాటు చేయడమే ఆయ‌న ల‌క్ష్యంగా పేర్కొన్నారు.

హైద‌రాబాద్ లో జరిగిన  ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ప్రతినిధులతో జ‌రిగిన ఓ స‌మావేశంలో సోనుసూద్ ఈ విష‌యాన్ని  రివీల్ చేసారు. ఇలా సేవ‌లందించ‌డంలో వైద్య‌ప‌రంగా త‌న‌కు కొంత మంది డాక్ట‌ర్లు అందిస్తున్న స‌హ‌కారం ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేనిదిగా  పేర్కొన్నారు.

'ఓ రోజు రాత్రి ఇంటికెళ్లాక ఓ మహిళ నా ఇంటి ముందు కనిపించింది. విషయం అడిగితే న్యూరాలజీ సమస్యతో బాధపడుతున్నానని చెప్పింది. ఆమెను ఉదయం కలవమని చెప్పను. కానీ పరిచయం లేకున్నా ఆ రాత్రే ఓ వైద్యుడికి ఆమె రిపోర్టులు మెసేజ్ చేసాను. అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో ఆ డాక్టర్ స్పందించి ఆ మ‌హిళ‌ని పంపించ‌మ‌న్నారు. అలా వెళ్లిన ఆమె ఐదు నెలల చికిత్స అనంతరం కోలుకుని ఆరోగ్యంగా తిరిగొచ్చారు. అలాంటి వైద్యులు ఉండడడంతోనే సేవలు చేయ‌గ‌ల్గుతున్నా.

ఓసారి జోధ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి కాలేయ మార్పిడి కోసం  సంప్రదించాడు. అపోలో ఆసుపత్రిని సంప్రదిస్తే రూ. 40 లక్షల విలువైన చికిత్సను రూ. 18 లక్షలకే చేస్తామన్నారని చెప్పారు.

కానీ  రోగి వద్ద రెండు లక్షల రూపాయలే ఉండడంతో రాజస్థాన్ సీఎంతో మాట్లాడితే ఆయన రూ. 10 లక్షలు సాయం చేశారు. మిగతా సొమ్ము నేను  స‌మ‌కూర్చాను. అయితే  ఆపరేషన్ తర్వాత సీఎం ఇచ్చిన సొమ్మును చెల్లించకుండా ఆ వ్యక్తి తన ఖాతాలోనే ఉంచుకున్నాడు.
 
ఇలాంటి సందర్భాలు కూడా ఎదురయ్యాయని' సోనూ సూద్ గుర్తు చేసుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ 7.5ల‌క్ష‌ల మందికి స‌హాయం చేసాను. వారిలో 95 శాతం మందిని నేను చూడ‌లేదు. వాళ్లు ఎవ‌రో కూడా నాకు తెలియ దు. నా గురించి కూడా వాళ్ల‌కు తెలియ‌క‌పోవచ్చు. ఎక్క‌డైనా క‌ష్టాల్లో ఉంటే స‌హాయం అందండం ఒక్క‌టే చూస్తాను. మిగ‌తా విష‌యాలు ప‌ట్టించుకోను. అవ‌న్ని ఆలోచిస్తే స‌హాయం అంద‌దు' అని చెప్పుకొచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.