Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ రియల్ హీరోకి దుర్గపూజ మండపంలో విగ్రహం

By:  Tupaki Desk   |   22 Oct 2020 12:50 PM GMT
లాక్ డౌన్  రియల్ హీరోకి దుర్గపూజ మండపంలో విగ్రహం
X
లాక్​డౌన్​ కష్టకాలంలో పేద వలస కూలీలను ఆదుకొని సోనూసుద్​ దేశవ్యాప్తంగా హీరో అయ్యాడు. ఏ బాలీవుడ్​ హీరోకు రాని ఇమేజ్​ను సొంతం చేసుకున్నాడు. వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి వారిని స్వస్థలాలకు పంపించి గ్రేట్ అనిపించుకున్నాడు. కాగా ఈ నవరాత్రి వేడుకల్లో సోనూసుద్​కు అరుదైన గౌరవం లభించింది. కోల్‌కతాలోని కేష్టోపూర్ ప్రఫుల్ల కననదుర్గా పూజ కమిటీ వారు ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ప్రస్తుతం కోల్‌కతాలో జరుగుతున్న దుర్గపూజ పండల్‌లో సోనూ సూద్‌ విగ్రహాన్ని ప్రదర్శించి ఆయనపై గౌరవాన్ని చాటుకున్నారు.

అది చూసిన సోనూ సూద్‌ స్పందిస్తూ.. ‘ఇది నాకు దక్కిన అరుదైన గౌరవం ఎప్పటికైన ఇదే నాకు అతిపెద్ద ఆవార్డు’ అంటూ ట్వీట్‌ చేశారు. అదే విధంగా కెష్టోపర్‌ ప్రఫుల్ల దుర్గా కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. లాక్‌డౌన్‌లో వలస కార్మికులను బస్సులో తరలిస్తున్న సోనూసూద్‌ విగ్రహాన్ని, వలస కార్మికులు చేతులు జోడిస్తున్న విగ్రహాలను ఆ మండపంలో ఉంచారు. సంక్షోభ కాలంలో వలసదారులకు సంబంధించిన హృదయ విదారక దృశ్యాలను కూడా పండల్‌లో‌ ప్రదర్శించారు. హర్యానాలోని గురుగ్రామ్‌ నుంచి బీహార్‌ వరకు 1200 వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ తన కుమారుడిని సూట్‌కేసుపై లాక్కెళుతున్న మహిళా, బాబును ఓడిలో పెట్టుకుని గాయపడిన తన తండ్రిని తోపుడు బండిపై కూర్చోపెట్టి లాక్కెడం, సైకిల్‌ తోక్కుతున్న మహిళ విగ్రహాలను కూడా ప్రదర్శించారు.