Begin typing your search above and press return to search.

వైద్యులు ఎందుకు ఇలా చేస్తున్నారు? - సోనూసూద్ ఆవేద‌న‌

By:  Tupaki Desk   |   19 May 2021 7:30 AM GMT
వైద్యులు ఎందుకు ఇలా చేస్తున్నారు? - సోనూసూద్ ఆవేద‌న‌
X
క‌ష్టాల్లో ఉన్న‌వారిని ఆదుకునేందుకు నేనున్నా అంటూ ముందుకు వ‌చ్చాడు సోనూ సూద్‌. క‌రోనా తొలి ద‌శ నుంచి మొద‌లైన అత‌డి సేవా కార్య‌క్ర‌మాలు.. అంతే లేకుండా సాగుతున్నాయి. ఇప్పుడు సెకండ్ వేవ్ విజృంభిస్తుండ‌డంతో.. త‌న పూర్తి స‌మ‌యంలో సేవా కార్య‌క్ర‌మాల‌కే అంకితం చేశాడు సోనూ.

అయితే.. కొన్ని నెల‌ల కింద‌టి వ‌ర‌కు అభాగ్యులు, సాధార‌ణ జ‌నం మాత్ర‌మే సోనూ సేవ‌ల‌ను అందుకున్నారు. ఇప్పుడు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లూ సోనూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప‌రిస్థితి ఎలా త‌యారైందంటే.. ఎక్క‌డ సాధ్యం కాని ప‌నికూడా.. సోనూను ఆశ్ర‌యిస్తే జ‌రుగుతుందేమో అనుకునేంత‌గా మారిపోయింది.

అయిన‌ప్ప‌టికీ.. త‌న‌కు సాధ్య‌మైనంత మేర‌కు అడిగిన‌వారంద‌రికీ స‌హాయం చేసేందుకే ప్ర‌య‌త్నిస్తున్నాడు సోనూ. సుమారు నాలుగు వంద‌ల మందితో దేశ‌వ్యాప్తంగా నెట్వ‌ర్క్ ఏర్పాటు చేసుకొని, ఎక్క‌డి నుంచి స‌హాయం కావాల‌ని పిలుపు అందినా.. వెంట‌నే వాలిపోతున్నాడు.

ఏకంగా.. ఢిల్లీ వాసుల‌కు ఎవ‌రికైనా ఆక్సీజ‌న్ కావాల్సి వ‌స్తే.. 022-61403615 నంబ‌ర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాల‌ని కూడా సూచించాడు. అలాంటి వారికి ఏకంగా ఆక్సీజ‌న్ కాన్స‌న్ ట్రేట‌ర్ ను ఇంటికే పంపిస్తాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. దీంతో.. సోనూను సంప్ర‌దిస్తే.. ఏ స‌మ‌స్య అయినా తీరిపోతుంద‌ని భావిస్తున్నారు.

తాజాగా విశాఖ‌కు చెందిన ఓ వ్య‌క్తి ఎక్క‌డా అందుబాటులో లేని ఓ ఇంజ‌క్ష‌న్ కావాల‌ని కోరాడు. ఎంత‌గానో ప్ర‌య‌త్నించిన సోనూ.. చివ‌ర‌కు ఏదో మార్గం ద్వారా దాన్ని బాధితుల‌కు అంద‌జేశాడు. అయితే.. ఇలాంటి ఇంజ‌క్ష‌న్లే కావాలంటూ సోనూకు పెద్ద ఎత్తున విన‌తులు వ‌స్తున్నాయి.

దీనిపై సోనూ స్పందించాడు. అస‌లు అందుబాటులో లేని ఇంజ‌క్ష‌న్ల‌ను వైద్యులు ఎందుకు స‌జెస్ట్ చేస్తున్నార‌ని ప్ర‌శ్నించాడు. పెద్ద పెద్ద ఆసుప‌త్రుల్లోనే ల‌భించ‌ని ఇంజ‌క్ష‌న్ రాస్తే.. సామాన్యులు ఎక్క‌డి నుంచి దాన్ని తీసుకొస్తార‌ని అడిగాడు. ఆ మందు దొర‌క‌ద‌ని తెలిసిన త‌ర్వాత కూడా.. ప్ర‌త్యామ్నాయం ఎందుకు చూడ‌ట్లేదో తెలియ‌ట్లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు సోనూ. సోనూ ప్ర‌శ్న‌కు నెటిజ‌న్లు మ‌ద్ద‌తు తెలిపారు. కొంద‌రు బ్లాక్ మార్కెట్ ను పెంచేందుకేన‌ని కామెంట్ చేస్తున్నారు. వైద్యులు మాత్రం దానికి ప్ర‌త్యామ్నాయం క‌నిపించ‌లేద‌ని చెబుతున్న‌ట్టు స‌మాచారం.