Begin typing your search above and press return to search.
సుప్రీం తలుపుతట్టిన సోనూసూద్.. అక్కడైనా న్యాయం జరిగేనా..!
By: Tupaki Desk | 23 Jan 2021 3:45 AM GMTముంబైలోని జుహు ప్రాంతంలో సోనూ సుద్కు శక్తిసాగర్ పేరిట ఓ భవంతి ఉంది. అయితే ఇది నివాస సముదాయమని.. అనుమతులు తీసుకోకుండానే ఈ భవంతిని ఆయన హోటల్ గా మార్చాడని బీఎంసీ అధికారులు నోటిసులు పంపించారు. దీంతో సోనూ సుద్ హైకోర్టు ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు కూడా సోనూ సుద్ పిటిషన్ ను తిరస్కరించింది. అయితే ఇప్పుడు తాజాగా సోనూ సుద్ సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా సోనూ సుద్ తరఫు న్యాయవాది వినీత్ ధందా మీడియాతో మాట్లాడుతూ.. ‘నా క్లయింట్ నిబంధనలు ఉల్లంఘించలేదు. కానీ బీఎంసీ అతడి పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించింది.
సోనూ సుద్ నేర ప్రవత్తి గత వాడంటూ అభ్యంతరకరంగా మాట్లాడింది. పరుష పదజాలాన్ని ఉపయోగించింది’ ఇది సరికాదు అంటూ ఆయన పేర్కొన్నారు. ఎప్పటికయినా న్యాయం గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కచ్చితంగా తమకు న్యాయం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సోనూసూద్ ఇమేజ్‌కు భంగం కలిగిలా బీఎంసీ వ్యవహరించిందని ఆరోపించారు. సోనూ సుద్ లాక్‌డౌన్ కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే.
అయితే శక్తిసాగర్ భవంతికి సోనూ సుద్ ఓనర్ కాదని ఓ సారి.. ఆయనే ఓనర్ అని ఆక్రమణదారుడు అని మరోసారి బీఎంసీ ఆరోపించడం గమనార్హం. సోనూ సుద్ తరుచూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటు ఉంటారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని ఆయన సోషల్ మీడియాలో తెలుసుకన్న వెంబడే వాళ్లకు న్యాయం చేస్తాడు. గత లాక్ డౌన్ లో ఆయన చాలా మందికి న్యాయం చేశాడు. దీంతో సోనూ సుద్ సోషల్ మీడియా లో హీరోగా మారి పోయాడు.