Begin typing your search above and press return to search.

సోనూ సూద్ ట్రాక్టర్ వివాదం.. ఆ రైతు స్పందించాడు

By:  Tupaki Desk   |   28 July 2020 3:30 AM GMT
సోనూ సూద్ ట్రాక్టర్ వివాదం.. ఆ రైతు స్పందించాడు
X
చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఒక రైతు తన ఇద్దరు కుమార్తెలను కాడెద్దులుగా మలిచి దున్నడం.. ఆ వీడియో వైరల్ కావడం.. స్పందించిన నటుడు సోనూ సూద్ వారికి ఒక ట్రాక్టర్ కొనివ్వడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

నాగేశ్వరరావు కుటుంబం కడు పేదరికంలో లేదని.. ప్రభుత్వం నుంచి వారికి సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయని అంటున్నారు . నాగేశ్వరరావు పిల్లలు సరదాగా కాడె లాగారని.. ఆ వీడియో వైరల్ అవ్వడంతో ట్రాక్టర్ లభించిందని ప్రచారం జరిగింది . ఆయన ఆర్థికంగా ఉన్నవాడేనని మీడియాలో కథనాలు వచ్చాయి.

మీడియాలో తాను పేదను కాదంటూ వస్తున్న వార్తలపై తాజాగా నాగేశ్వరరావు స్పందించారు. తాను ఒక దళితుడిని అని.. మానవ హక్కుల కార్యకర్తగా పనిచేశానని.. 2009 ఎన్నికల్లో లోక్ సత్తా పార్టీ నుంచి పోటీచేశానని..1000 ఓట్లకు పైగా పడ్డాయని వివరించారు. ఒక నేత పోటీచేసి..ఓడిపోతానని తెలిసి భయపడి తనను డమ్మీగా నిలబెట్టాడని రైతు నాగేశ్వరరావు తెలిపారు. తనకు తానుగా పోటీచేయలేదన్నారు.

కొందరు చెబుతున్నట్టు రైతు భరోసా కింద డబ్బులు వచ్చాయని.. కానీ మేం సాగు చేసే వ్యవసాయ భూమి మా నాన్న పేరుమీద ఉండడంతో ఎన్ని డబ్బులు ఆయన అకౌంట్లో పడ్డాయో తెలియదని వివరించాడు. అమ్మఒడి కింద రూ.10వేల రూపాయలు పడ్డాయని వివరించారు.

ఇక మా నాయనకు ప్రభుత్వ పెన్షన్ రూ.2250 వస్తోందని.. అదే తమకు ఆధారమని నాగేశ్వరరావు తెలిపారు. కరోనాతో ఉన్న ఉపాధి పోయి బతకలేక మా నాన్న కాడి వచ్చానని.. ఇప్పుడు సాగు చేసుకుంటున్నానని వివరించాడు. కరోనా రాకపోయింటే తనకు ఇన్ని కష్టాలు వచ్చి ఉండేవి కావని వివరించారు.

మా శరీరం.. మంచి దుస్తులు చూసి తమను ఆర్థికంగా ఉన్న వారని ఎలా పరిగణిస్తారని నాగేశ్వరరావు తెలిపారు. నేను వద్దంటున్నా మా పిల్లలే సాగు చేద్దామని అలా దున్నారని.. వాళ్లను నవ్విస్తూ తాను పనిచేశానని వివరించారు. మా అల్లుడు వీడియో తీశాడని.. సిగ్గుతో మా బిడ్డలు నవ్వారని వివరించారు. శరీరం రంగు, కొలతల్ని చూసి మమ్మల్ని డబ్బున్న వాళ్లుగా పరిగణించవద్దంటూ తాను పేదవాడినే అని నాగేశ్వరరావు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు.