Begin typing your search above and press return to search.

పాలించే పెద్దోళ్లు వాటర్‌ బిల్లులు కట్టలేదే

By:  Tupaki Desk   |   19 March 2015 11:59 AM IST
పాలించే పెద్దోళ్లు వాటర్‌ బిల్లులు కట్టలేదే
X
సోనియాగాంధీ.. మన్మోహన్‌సింగ్‌.. అద్వానీ.. స్మృతి ఇరానీ.. శశిథరూర్‌.. దిగ్విజయ్‌ సింగ్‌.. కేసీఆర్‌.. పాల్వాయ్‌ గోవర్థనరెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 317 మంది లోక్‌సభ..రాజ్యసభకు చెందిన ఎంపీలతో పాటు.. 859 మంది మాజీ నేతలకు సంబంధించిన ఆశ్చర్యకరమైన అంశాల్ని న్యూ ఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌ బయటపెట్టింది.

పదేళ్లు రిమోట్‌ తో దేశాన్ని ఏలిని సోనియమ్మే కాదు.. ప్రధానమంత్రి పదవిని పదేళ్లు నిర్వహించటమే కాదు.. వ్యక్తిత్వంలో వంక పెట్టటానికి వీల్లేని మన్మోహన్‌ సింగ్‌ మొదలు.. రాజకీయ కురువృద్ధుడు అద్వానీనే కాదు.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ సహా వందలాది మంది నేతలు ఢిల్లీ మున్సిపాలిటీకి పన్ను బకాయిలు ఉన్నట్లు తేలింది.

న్యూ ఢిల్లీ మున్సిపాలిటీకి ఉన్న బకాయిలకు సంబంధించిన వివరాల్ని బయటకు వెల్లడించారు.వీరిలో భారీగా ప్రముఖులు ఉండటం చూసినప్పుడు..చట్టాలు చేసే వారు.. చట్టాన్ని తూచా తప్పకుండా పాటించాలంటూ చిలకపలుకులు పలికే నేతలు.. వ్యక్తిగతంగా వాడుకున్న నీటికి కూడా బకాయిలు ఉండటం చూసినప్పుడు భారత రాజకీయ వ్యవస్థ దురదృష్టం ఏమిటో ఇట్టే అర్థమైపోవటం ఖాయం. బాధ్యత లేని వారు.. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండటం ఏమిటో..?