Begin typing your search above and press return to search.

సోనియమ్మ తలనొప్పిని తీర్చేసిన రాహుల్.. వచ్చే ఏడాది పట్టాభిషేకం

By:  Tupaki Desk   |   17 Oct 2021 11:06 AM GMT
సోనియమ్మ తలనొప్పిని తీర్చేసిన రాహుల్.. వచ్చే ఏడాది పట్టాభిషేకం
X
గడిచిన కొన్నేళ్లుగా సాగుతున్న హైడ్రామాకు తెర పడినట్లే. కాంగ్రెస్ పార్టీ రథసారధిగా ప్రస్తుతానికి సోనియాగాంధీ ఉన్నప్పటికీ.. ఆమె తాత్కాలిక అధ్యక్షురాలు మాత్రమేనని.. పూర్తిస్తాయి అధ్యక్షుడ్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్న మాట గడిచిన కొద్దిరోజులుగా వినిపిస్తుండటం.. దీనికి బలం చేకూరేలా జీ23 పేరుతో.. సీనియర్లు ఒక టీంగా ఏర్పడి.. రాహుల్ కు వ్యతిరేకంగా విమర్శలు చేయటం.. ఆయన్ను ఆత్మరక్షణలో పడేలా చేయటం తెలిసిందే.

తాజాగా జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో నాటకీయ పరిణామాలు వరుస పెట్టి జరగటమే కాదు.. ఈ ఒక్క మీటింగ్ తోనే పలు అంశాల లెక్కల్ని తేల్చేశారు సోనియమ్మ. నలుగురు మధ్య మాట్లాడే కన్నా.. నాలుగు గోడల మధ్య పార్టీ విషయాల్ని చర్చించాలని సీనియర్లకు చురకలు అంటించటమే కాదు.. వారి నుంచి తానేమీ ఆశిస్తున్న విషయాన్ని చెప్పేశారు. అంతేకాదు.. తాను తాత్కాలిక అధ్యక్షురాలిని కాదని.. పూర్తిస్థాయి అధ్యక్షురాలిని అంటూ తేల్చేసిన వైనంపై. అనవసరమైన తలనొప్పులకు చెక్ చెప్పేశారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజా సమావేశంలో రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టాలని కోరారు పంజాబ్.. రాజస్థాన్.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అంతేకాదు.. పార్టీని అధ్యక్ష స్థానంలో కూర్చొని నడిపించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. 2019 ఎన్నికలకు పార్టీ అధినేతగా ఉన్న రాహుల్. .ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీ పదవికి రాజీనామా చేయటం తెలిసిందే. తాజాగా వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో తాను వచ్చే ఏడాది మొదట్లో పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని చేపడతానని ఆయన స్పష్టం చేశారు.

దీంతో.. పార్టీకి సోనియమ్మ తర్వాత వారసుడు ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చేయటమేకాదు.. పార్టీని.. రాహుల్ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తున్న సీనియర్లకు సోనియమ్మ తాజా సమావేశంతో చెక్ పెట్టారని చెబుతున్నారు. అంతేకాదు.. రానున్న కొద్ది నెల్లలో జరిగే యూపీ.. ఉత్తరాఖండ్.. గోవా.. మణిపూర్ లో జరిగే అసెంబ్ీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టి.. అక్కడ విజయం సాధించటం మీద ద్రష్టి పెట్టాలన్న పిలుపును సోనియమ్మ ఇవ్వటం గమనార్హం. మొత్తానికి వదిలేసిన బాధ్యతల్ని తిరిగి తీసుకునేందుకు రాహుల్ సిద్ధమయ్యారని చెప్పక తప్పదు.