Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ ను ప్రక్షాళన చేసిన సోనియా
By: Tupaki Desk | 12 Sep 2020 6:00 AM GMTఅధినేత్రి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేశారు.కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పు అవసరమని లేఖ రాసిన కాంగ్రెస్ సీనియర్ నేతలకు అధిష్టానం షాకిచ్చింది. నిరసన గళం వినిపించి సీనియర్లు అందరినీ ఏకతాటిపైకి తెచ్చి లేఖ రాసిన గులాంనబీ ఆజాద్ ను సోనియా పక్కనపెట్టడం సంచలనమైంది. దీన్ని బట్టి నిరసనగళం వినిపిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. గులాం నబీ అజాద్ అధకారాలకు పూర్తిగా కత్తెర వేయగా.. గళమెత్తిన శశిథరూర్, కపిల్ సిబాల్ లాంటి నేతలకు ఎలాంటి పదవులు ఇవ్వలేదు.
సోనియా గాంధీ ఆరుగులు సభ్యులతో అత్యున్నత కమిటీని నియమించింది. ఇక నుంచి ఆరుగురు సభ్యులతో సోనియా ఏర్పాటు చేసిన అత్యున్నత కమిటీయే కాంగ్రెస్ ను పాలిస్తుంది. వారి సలహాల ప్రకారమే సోనియా ముందుకెళుతుంది. దీన్నే రాహుల్ గాంధీ టీంగా అభివర్ణిస్తున్నారు. ఈ కమిటీలో అంటోనీ, అహ్మద్ పటేల్, అంబికాసోనీ, వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్, రణదీప్ సూర్జేవాలా లతో అత్యున్నత కమిటీని సోనియా ఏర్పాటు చేశారు.ఈ ఆరుగురే సోనియా ప్రాధాన్యత ఇస్తారని తేటతెల్లమైపోయింది.
కాంగ్రెస్ లోని కోవర్టులను, వృద్ధ జంబూకాలను తీసివేయాలని డిమాండ్ చేస్తున్న రాహుల్ గాంధీకి సర్వాధికారాలు కట్టబెట్టేలా ‘రాహుల్ గాంధీ టీం’నే పార్టీలోకి తీసుకున్నారు. పెద్ద పీట వేశారు. ఇక పార్టీపై పట్టును కోల్పోకుండా సోనియా తనకు నమ్మదగిన నేతలకే పెద్దపీట వేశారు.
ఇక యూపీ ఎన్నికల నేపథ్యంలో ప్రియాంకను ఉత్తరప్రదేశ్ ఇన్ చార్జిని చేశారు. దీన్ని బట్టి ఇక సోనియా కాంగ్రెస్ లో మరోసారి యాక్టివ్ రోల్ పోషించబోతోందని.. రాహుల్ కోరినట్టే ఆయన అనుకూల టీం ఏర్పాటు చేసినట్టు అర్థమవుతోంది.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సోనియా సహా 22 మంది ఉంటారు. 26 మంది శాశ్వత సభ్యులు.. 9మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉంటారు.
తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ ఇన్ చార్జులను కూడా కాంగ్రెస్ అధిష్టానం మార్చేసింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా మాణికం ఠాగూర్ ను, ఏపీ ఇన్ చార్జిగా ఉమేన్ చాందీని నియమించారు. ఉత్తరప్రదేశ్ కు ప్రియాంకగాంధీని, తమిళనాడుకు దినేష్ గుండూరావు, మహారాష్ట్రకు హెక్ పాటిల్, బెంగాల్ కు జితిన్ ప్రసాద, కర్ణాటకలో రణ్ దీప్ సూర్జేవాలను నియమించారు. దీన్ని బట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను సోనియా ప్రక్షాళన చేసినట్టు అయ్యింది.