Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ లో ఊహించని మలుపు.. సోనియాకే పట్టం?
By: Tupaki Desk | 24 Aug 2020 4:01 PM GMTఅటు తిరిగి.. ఇటు తిరిగి.. కథ క్లైమాక్స్ కు చేరి చివరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకే పార్టీ పగ్గాలు దక్కాయి. అధ్యక్ష పదవి కేంద్రంగా సాగిన ఈ కుమ్ములాటల్లో చివరకు పార్టీ భవిష్యత్ దృష్ట్యా మళ్లీ అమ్మనే అందరూ ఎన్నుకున్నారట.. తాజా పరిణామాలతో కాంగ్రెస్ లో కుమ్ములాటలు మొదలయ్యాయి. పరిస్థితి చేజారింది. ఎవరికి అధ్యక్ష బాధ్యతలు మార్చినా కాంగ్రెస్ పని ఖతమవుతుందని సోనియా గ్రహించినట్టుంది. అందుకే సోనియానే తిరిగి బాధ్యతలు తీసుకుంది. సీనియర్లు కూడా సోనియా అయితేనే అందరూ వింటారని చెప్పడంతో ఆమె కాంగ్రెస్ సారథిగా మరికొంత కాలం ఉండాలని నిర్ణయించుకున్నారు.
కాంగ్రెస్ సీనియర్లు అంతా కూడబలుక్కొని కాంగ్రెస్ పగ్గాలు వేరే వారికి అప్పగించాలని లేఖ రాయడం.. దానిపై రాహుల్ గాంధీ మీటింగ్ లో సీనియర్లపై నిప్పులు చెరగడం.. చివరకు సోనియాగాంధీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను మన్మోహన్ కు అప్పజెప్పుతున్నట్లు డిసైడ్ అవ్వడం ఈరోజు చకచకా జరిగిపోయాయి. కానీ కాంగ్రెస్ కథలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. కొత్త సారథిపై ఏకాభిప్రాయం కాంగ్రెస్ లో కొరవడింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ సారథిగా సోనియాగాంధీనే నియామకం కానున్నారని తెలుస్తోంది. నేతల ఒత్తిడితో మళ్లీ సోనియా గాంధీయేతరులకు కాంగ్రెస్ పగ్గాలు అప్పజెప్పాలనే నిర్ణయాన్ని విరమించుకున్నట్టు తెలిసింది.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఈసారి వాడివేడిగా సాగింది. రాహుల్ గాంధీ సినియర్లను కడిగేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. పార్టీని ప్రక్షాళన చేయాలని 23మంది సీనియర్లు సోనియాకు లేఖ రాసిన తీరుపై రాహుల్ సీరియస్ అయ్యారు. బీజేపీతో కుమ్మక్కయ్యారని నిలదీశాడని వార్తలు వచ్చాయి.
సీనియర్లు అంతా కూడబలుక్కోవడం.. దీని వెనుక బీజేపీ హస్తం ఉందన్న ఆరోపణలు రావడం.. కాంగ్రెస్ ప్రక్షాళనకు నడుం బిగించడం.. అదే జరిగితే కాంగ్రెస్ నుంచి గాంధీ కుటుంబం పగ్గాలు చేజారుతాయనే భయం సోనియాగాంధీలో వ్యక్తమైంది. దీంతో కాంగ్రెస్ సీనియర్ల ఒత్తిడి మేరకు సోనియాగాంధీనే సారథ్యం వహించాలని కోరారు. మరికొంత కాలం సోనియాగాంధీనే అధ్యక్ష పదవిలో కొనసాగాలని డిసైడ్ అయినట్లు జాతీయ మీడియా పేర్కొంది.